సూర్యాపేట జిల్లా:రోజురోజుకు పెరుగుతున్న ధరలను నియంత్రించడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందాయని,దీనికి వ్యతిరేకంగా ఈ నెల 27 నుండి 31 వరకు జిల్లా వ్యాప్తంగా జరిగే నిరసన కార్యక్రమాన్ని వామపక్ష శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి,సిపిఐ జిల్లా నాయకులు దోరేపల్లి శంకర్,సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు గంట నాగయ్య, సిపిఐ(ఎంఎల్) ప్రజాపంథా జిల్లా కన్వీనర్ కొత్తపల్లి శివకుమార్,ఎంసిపిఐయు జిల్లా కార్యదర్శి వరికుప్పల వెంకన్న,సిపిఐ(ఎంఎల్)రామచంద్రన్ వర్గం రాష్ట్ర నాయకులు బుద్ధ సత్యనారాయణ,బహుజన కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి చామకూరి నర్సయ్య లు పిలుపునిచ్చారు.
మంగళవారం సిపిఎం జిల్లా కార్యాలయంలో జరిగిన వామపక్ష పార్టీల సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్,డీజిల్,వంటగ్యాస్, బస్సు చార్జీలు,విద్యుత్ చార్జీలు,ఇష్టానుసారం పెంచటం మూలంగా పేద,మధ్యతరగతి ప్రజలపై మోయలేని భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రజలందరికీ 14 రకాల నిత్యావసర వస్తువులను అందించాలని డిమాండ్ చేశారు.అసంఘటిత రంగ కార్మికులకు 7500 రూపాయలు ఇవ్వాలని కోరారు.
ఉపాధి హామీ చట్టానికి నిధులు పెంచి పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకాన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి యువతను ఆదుకోవాలన్నారు.
నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి కల్పించాలన్నారు.ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరి రావు,మట్టిపెళ్లి సైదులు,ఏలుగురి గోవింద్,కోట గోపి, జిల్లపల్లి నరసింహారావు,మేఘనబోయిన శేఖర్,దండా వెంకటరెడ్డి,వామపక్ష నాయకులు షేక్ నజీర్,ఎర్ర అఖిల్ తదితరులు పాల్గొన్నారు.
Latest Suryapet News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy