Dhanush Sir Movie : 'సార్' ఫస్ట్ సింగిల్ అప్డేట్.. టైం, డేట్ ఫిక్స్.. ఎప్పుడు రాబోతుందంటే?

విభిన్నమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని స్టార్ హీరో అయ్యాడు ధనుష్.కోలీవుడ్ లో ఇతడు స్టార్ హీరోల్లో ఒకరిగా వెలుగుతున్నాడు.

 Latest Update On Vaathi's First Single, Vaathi First Single, Sir Movie, Dhanush,-TeluguStop.com

ఇక ప్రెజెంట్ ధనుష్ తెలుగు డైరెక్టర్ తో సినిమా చేస్తున్న విషయం విదితమే.ఇంతకు ముందే తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే కానీ ఇప్పుడు వరకు డబ్బింగ్ సినిమాలతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన ఇప్పుడు డైరెక్ట్ తెలుగు సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ప్రెసెంట్ ధనుష్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేసాడు.‘సార్‘ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అయ్యి చివరి దశకు చేరుకుంది.ఈ సినిమా ధనుష్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతుంది.సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా తమిళ్, తెలుగులో ఒకేసారి తెరకెక్కుతుంది.

తమిళ్ లో ‘వాతి‘ పేరుతో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో సాయి కుమార్ విలన్ గా నటిస్తున్నాడు.ఇక ఈ సినిమాను సితార ఎంటెర్టైన మెంట్స్ ఇంకా ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

జి వి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.తాజాగా ఈ సినిమా నుండి జివి ప్రకాష్ ఒక అప్డేట్ అందించాడు.

Telugu Dhanush, Kollywood, Latest Vaathis, Sir, Tollywood, Vaathi, Venky Atluri-

ఈ సినిమా నుండి ఈ రోజు ఫస్ట్ సింగిల్ అప్డేట్ రాబోతుంది అని సోషల్ మీడియా వేదికగా తెలిపాడు.మరి మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది.ఇక ఈ సినిమా షూట్ పూర్తి అవుతున్న నేపథ్యం లోనే ఇటీవలే రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు..ఈ సినిమా డిసెంబర్ 2న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్నట్టు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube