నిధులు రాక నిర్వహణ లేక బోసిపోతున్న రైతు వేదికలు...!

సూర్యాపేట జిల్లా:వ్యవసాయ సీజన్లో రైతులకు సలహాలు, సూచనలు,ఇవ్వటానికి గత ప్రభుత్వ హయాంలో కోట్లాది రూపాయల ఖర్చుతో క్లస్టర్ పరంగా ఏర్పాటు చేసిన రైతు వేదికలు గత ఏడాదిన్నర కాలంగా నిధులు రాక, నిర్వహణ లేక సూర్యాపేట జిల్లా మునగాల మండల వ్యాప్తంగా రైతు వేదికలు( Rythu Vedikas ) బోసిపోయి అధ్వానంగా మారాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రైతన్నల సంక్షేమమే ధ్యేయంగా గత ప్రభుత్వం రైతు వేదికలను నిర్మించి వాటిని ఉత్సవ విగ్రహాల్లా మార్చిందని, ప్రస్తుతం వాటి వలన ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని వాపోతున్నారు.

ఏడాది కాలంగా వాటి నిర్వహణ కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో నిర్వహణ భారంగా మారింది.వ్యవసాయ క్లస్టర్ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారుల పర్యవేక్షణలో పనిచేయాల్సిన రైతు వేదికలు నిధులు లేక ఏఈఓలు అనేక అవస్ధలు పడుతున్నారని తెలుస్తుంది.

మండలంలోని రైతు వేదికలకు కరెంట్ బిల్లు మరియు స్వీపర్ ఛార్జీలు ఏఈవోలు( AEOs ) సొంత డబ్బులు చెల్లిస్తున్నారని సమాచారం.ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వమైనా చొరవ తీసుకొని రైతు వేదికల నిర్వహణకు నిధులు విడుదల చేయాలని కోరుతున్నారు.

ఇథనాల్ పరిశ్రమ అనుమతిని రద్దు చేయాలి : కన్నెగంటి రవి
Advertisement

Latest Suryapet News