బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శిగా కుమార్ యాదవ్

భారతీయ జనతా యువమోర్చా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామానికి చెందిన మానుక కుమార్ యాదవ్ ని నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేసిన బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాగుల రాజిరెడ్డి.

ఈ సందర్భంగా రాజి రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో బిజెపి అధికారం సాదించే దిశగా పనిచేయాలని సూచించారు ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలియజేశారు.

సందర్భంగా మానుక కుమార్ యాదవ్ తన నియామకానికి సహకరించిన బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్, బిజెపి జిల్లా అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణ, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి గోపి, మల్లికార్జున్, బిజెపి మండల అధ్యక్షుడు పొన్నాల తిరుపతి రెడ్డి లకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ పార్టీ సూచించిన కార్యక్రమాలలో విధేయతగా పనిచేస్తానని జిల్లాలో బిజెపి గెలుపు దిశగా పని చేస్తానని అన్నారు.

Kumar Yadav As District General Secretary Of BJYM, Kumar Yadav ,District General
కస్టమర్‌లా వచ్చింది.. అందరి కళ్లుగప్పి చెప్పులు కొట్టేసింది.. సీసీటీవీ ఫుటేజ్ చూస్తే!

Latest Rajanna Sircilla News