మీ రాజకీయ భవిష్యత్ కు నాది హామి-జలగం సుధీర్ కు కేటీఆర్ భరోసా...!

సూర్యాపేట జిల్లా:అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ ను శనివారం కోదాడకు చెందిన ఎన్ఆర్ఐ,కోదాడ ఎమ్మెల్యే సీటు ఆశిస్తున్న జలగం సుధీర్ కుమార్ టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్ నగరంలో కలిశారు.

పుట్టిన గడ్డ కోసం ఏదైనా చేయాలనే తపనతో ఇండియాకు తిరిగొచ్చి గత ఏడేళ్లుగా నియోజకవర్గ పరిధిలోని అతని చేసిన సామాజిక సేవా కార్యక్రమాల వివరాలను ఒక రిపోర్ట్ రూపంలో మంత్రి కేటీఆర్ కు అందించడం జరిగిందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా భవిష్యత్ లో తనకు రాజకీయ అవకాశమిస్తే నా పనితీరుతో మరికొంత మార్పు తీసుకువస్తానని వివరించగా,మీ పూర్తి వివరాలు మా దగ్గర ఉన్నాయని,తప్పకుండా మీకు మంచి అవకాశం వచ్చేలా చూస్తానని మాట ఇచ్చారని తెలిపారు.ఉదయం నుండి సాయంత్రం వరకు అనేకమంది పారిశ్రామిక వేత్తలను,ప్రవాస భారతీయులను కలుస్తూ తెలంగాణకు పెట్టుబడుల విషయంలో శ్రద్ద కనపరుస్తున్న కేటీఆర్ ప్రయత్నాలు అభినందనీయమని జలగం సుధీర్ అన్నారు.

KTR Assures Jalagam Sudhir Political Future,KTR ,Jalagam Sudhir, Jalagam Sudhir

Latest Suryapet News