కృష్ణ ఫ్యామిలీ హీరో మూవీ నుండి ఎట్టకేలకు అప్డేట్‌ వచ్చింది

సూపర్‌ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న మరో వ్యక్తి గల్లా అశోక్‌.

ఈయన ఎంపీ గల్లా జయదేవ్ తనయుడు అనే విషయం తెల్సిందే.

మహేష్‌ బాబు మేనల్లుడు అయిన అశోక్‌ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా మూడు నాలుగు ఏళ్లుగా వార్తలు వస్తున్నాయి.హీరో అనే సినిమా తో అశోక్‌ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అయ్యాడు.

ఆ సినిమా ప్రారంభం అయ్యి కూడా చాలా కాలం అయ్యింది.కరోనా కారణంగా సినిమా కాస్త ఆలస్యం అవుతూ వచ్చింది.

ఆమద్య ఎలాంటి అప్ డేట్‌ లేకపోవడంతో హీరో కాస్త జీరో అయ్యాడా అంటూ కొందరు కామెంట్స్ చేశారు.అశోక్‌ మరో సినిమా తో వచ్చే ఉద్దేశ్యం ఏమైనా ఉందా.

Advertisement
Krishna Family Hero Galla Ashok Movie Hero Getting Ready For Release,latest Toll

ఈ సినిమాను తాత్కాలికంగా పక్కకు పెడుతారా అంటూ అనుమానాలు వ్యక్తం అయ్యాయి.ఎట్టకేలకు కృష్ణ మనవడు అశోక్‌ గల్లా సినిమాకు సంబంధించిన అప్ డేట్ వచ్చింది.

సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా క్లారిటీ ఇవ్వడం జరిగింది.

Krishna Family Hero Galla Ashok Movie Hero Getting Ready For Release,latest Toll

రానా చేతుల మీదుగా ఈ సినిమాకు సంబంధించిన పాటను విడుదల చేయించారు.అచ్చ తెలుగందమే.అంటూ సాగే ఈ పాట ను విడుదల చేయడం ద్వారా వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేస్తామన్నట్లుగా ప్రకటించారు.

ఈ మద్య కాలంలో వరుసగా పెద్ద సినిమాలు విడుదలకు సిద్దం అవుతున్నాయి.కనుక ఈ సమయంలో సినిమాల విడుదల కరెక్ట్‌ కాదన్న ఉద్దేశ్యంతో గల్లా అశోక్ సినిమా ను ఆలస్యంగా విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నారట.

ఇదేం కాంప్లిమెంట్ రా బాబోయ్.. పొగిడినట్టే పొగిడి భారతీయులను అవమానించిన ఆస్ట్రేలియా కపుల్..
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023

విడుదల ఎప్పుడైనా ఉండనివ్వండి కాని ఈ సినిమా రెడీ అవుతుందనే ఒక మెసేజ్‌ ను ఇవ్వడం వల్ల చిత్ర యూనిట్‌ సభ్యులు గత కొన్ని రోజులుగా ఉన్న సస్పెన్స్ కు తెర దించిన వారు అయ్యారు.రికార్డు స్థాయి లో ఈ సినిమా ను విడుదల చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

Advertisement

ఇండస్ట్రీలో ఉన్న పరిచయాలు మరియు ఇతర విషయాల కారణంగా గల్లా అశోక్ మొదటి సినిమా హీరో గురించి జనాలు చాలా ఆసక్తిగా ఉన్నారు.ఈయన కృష్ణ ఫ్యామిలీ నుండి ఎంట్రీ ఇవ్వబోతున్న ఒక సూపర్ స్టార్‌ గా నిలుస్తాడా అనేది చూడాలి.

తాజా వార్తలు