కోమటిరెడ్డి బ్రదర్స్ ఎప్పుడు పదవులను ఆశించలేదు: ఎమ్మేల్యే రాజ్ గోపాల్ రెడ్డి

నల్లగొండ జిల్లా:తన సతీమణి కోమటిరెడ్డి లక్ష్మీ( Komatireddy Laxmi )కి భువనగిరి ఎంపీ టికెట్ కోరుతున్నట్లు కొన్ని పత్రికల్లో,ఛానల్లో వస్తున్న ప్రచారం అవాస్తవమని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Raj Gopal Reddy ) అన్నారు.

శనివారం నల్లగొండ జిల్లా మునుగోడు క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోమటిరెడ్డి బ్రదర్స్ ఎప్పుడూ పదవులను ఆశించలేదని,నామినేటెడ్ పదవులు కావాలని కోరినట్టు చరిత్రలోనే లేదన్నారు.

భువనగిరి ( Bhuvanagiri )ఎంపీ టిక్కెట్బీసీలకి ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని,బీసీనాయకుడికి టిక్కెట్ ఇస్తే రాష్ట్రంలోనే భువనగిరి ఎంపీని భారీ మెజార్టీతో గెలిపిస్తామని,కాంగ్రెస్ అధిష్టానం ఎవరిని నిర్ణయించినా కోమటిరెడ్డి బ్రదర్స్ ఎంపీగా గెలిపిస్తామన్నారు.తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన ఘనత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి( Minister Komatireddy Venkat Reddy ) దని,కోమటిరెడ్డి బ్రదర్స్ కి పదవులు ముఖ్యం కాదని,ప్రజలనే కుటుంబ సభ్యులుగా చూసుకోవడమే లక్ష్యమని తెలిపారు.

Komatireddy Brothers Never Aspired To Positions Mla Raj Gopal Reddy-కోమ�
మనుషులకు ఇక చావు లేదు.. అమరత్వ రహస్యం కనిపెట్టిన సైంటిస్టులు..?

Latest Nalgonda News