లబ్ధిదారులకు రుణాలు పంపిణీ చేసిన అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్

పీఎం సూరజ్ పోర్టల్ (PM-SURAJ national portal )ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(Narendra Modi ) ఆన్లైన్ ద్వారా బుధవారం ప్రారంభించగా, జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఎన్ఐసి వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లాలోని పలువురు లబ్ధిదారులు, వివిధ శాఖల అధికారులు, బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రధానమంత్రి పలువురు లబ్ధిదారులతో ఆన్లైన్లో మాట్లాడారు.

వారు తాము ఎంచుకున్న రంగంలో ఎదిగిన తీరును అడిగారు.పలువురిని అభినందించారు.

అనంతరం అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్( Sri Kheemya Naik ) తన ఛాంబర్ లో పలువురు సఫాయి కార్మికులకు పీపీఈ, వ్యక్తిగత సంరక్షణ కిట్లు, రూ.ఐదు లక్షల విలువైన ఆరోగ్య బీమా పత్రాలను పంపిణీ చేశారు.అలాగే పలువురు లబ్ధిదారులకు బ్యాంకు రుణాల పత్రాలను అందజేశారు.

అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వినోద్ కుమార్, బీసీ కార్పొరేషన్ ఈడీ మోహన్ రెడ్డి, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ లావణ్య, ఎల్డిఎం మల్లికార్జునరావు, పలు బ్యాంకుల మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
రహదారిపై వాహనదారుల ఇబ్బందులు

Latest Rajanna Sircilla News