రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla ) తంగళ్ళపల్లి మండలం నర్సింహులపల్లె గ్రామంలో గృహ జ్యోతి( Gruha Jyoth ) పథకాన్ని ప్రారంభించిన నెరెళ్ళ ప్యాక్స్ వైస్ చైర్మన్ బొంగరం శ్రీనివాస్ రెడ్డి ,బీసీ సెల్ మండల అధ్యక్షుడు కావటి మల్లేశం,బొంగరం జనార్ధన్ రెడ్డి లు కలసి ప్రారంభించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి గ్యారెంటీని అమలు చేస్తుందని శ్రీనివాస్ రెడ్డి,కావటి మల్లేశం యాదవ్ తెలిపారు.
ప్రజా పాలన( Praja Palana )లో ప్రజలందరికీ మేలు జరుగుతుందని పేర్కొన్న నేతలు.ఈ కార్యక్రమంలో లైన్మెన్ రమేష్ ,పర్షరాములు, గ్రామ శాఖ రెడ్డమల్ల నర్సయ్య, పాతూరి నర్సింహ రెడ్డి, ద్యాగ ఎల్లయ్య, బొంగరం లక్ష్మారెడ్డి, ఇట్టిరెడ్డి రాజిరెడ్డి, ద్యాగ పర్షరములు,బావండ్లపెల్లి తిరుపతి, రెడ్డిమల్ల చంద్రయ్య,కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.







