ఖాళీ అవుతున్న ఖానాపురం...!

సూర్యాపేట జిల్లా:అనంతగిరి మండలం( Anantha Giri ) ఖానాపురం గ్రామంలో గ్రామశాఖ అధ్యక్షుడు మర్రి సంతోష్,ముదిరాజ్ నాయకుల ఆధ్వర్యంలో సుమారు 500 మంది బీఆర్ఎస్( BRS ) కు రాజీనామా చేసి ఆదివారం కాంగ్రెస్ అభ్యర్ధి ఉత్తమ్ పద్మావతి( Uttam Padmavathi ),మాజీ ఎమ్మెల్యే చందర్రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఉత్తమ్ పద్మావతి( Uttam Padmavathi ), మాట్లాడుతూ మర్రి సంతోష్ చేరికతో గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమైందని,గ్రామం మొత్తం త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరటానికి సిద్ధంగా ఉన్నారన్నారు.కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు,ఆరు గ్యారెంటీలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు చేరిన వారు తెలిపారు.

కోదాడలో కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయమన్నారు.

Advertisement

Latest Suryapet News