మహానటి తర్వాత కీర్తి సురేష్ మరో తెలుగు సినిమా చేయడానికి రెండేళ్ళ గ్యాప్ తీసుకుంది.అయితే గ్యాప్ వచ్చిన కూడా తెలుగు సినిమాల విషయంలో ఆమె ఆలోచన మారలేదు.
తనని గొప్పగా ఆదరించిన తెలుగు ప్రేక్షకుల కోసం మరోసారి లేడీ ఒరియాంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతుంది.మిస్ ఇండియా టైటిల్ తో ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ పతాకంపై మహేష్ కోనేరు నిర్మించిన కీర్తి సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు.
ఏప్రిల్ 17 న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.ఇక ఈ సినిమాతో నరేంద్రనాథ్ దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.
ఈ సినిమా తర్వాత కీర్తి సురేష్ తెలుగులో నితిన్ తో రంగ్ దే సినిమాతో పాటు, నానికి జోడీగా ఒక సినిమాలో నటించనుంది.ఈ ఏడాది వరుస సినిమాలతో మరల కీర్తి సురేష్ తెలుగులో బిజీ అవుతుంది.
మరి మహానటి ఇచ్చిన క్రేజ్ ఈ కొత్త సినిమా విషయంలో అమ్మడుకి ఎంత వరకు కలిసి వస్తుందో చూడాల్సిందే.
.