భాజపా కీలక నేత అమిత్ షా( Amit Shah ) పర్యటన సందర్భంగా ఖమ్మం జిల్లా( Khammam ) మొత్తం కాషాయ రంగులోకి మారిపోయింది .రైతు గోస -బాజాపా బరోసా పేరుతో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మాట్లాడిన అమిత్ షా అధికార బారాసపై నిప్పులు చెరిగారు .
భద్రాచలం రామాలయానికి దక్షిణ అయోధ్య గా పేరు ఉందని అంతటి ప్రాచుర్యం కలిగిన ఈ గుడికి శ్రీరామనవమి వేడుకలలో పట్టు వస్త్రాలు సమర్పించే సంప్రదాయాన్ని కేసీఆర్( CM KCR ) విస్మరించారని, ఎందుకంటే కేసీఆర్ కారు స్టీరింగ్ మజ్లిస్ పార్టీ నేత ఓవైసీ( Owaisi ) చేతుల్లో ఉందని, వారు ఎటు తిప్పితే కేసీఆర్ అటు తిరుగుతారని వచ్చే శ్రీరామనవమికి కేసీఆర్ భద్రాచలం వెళ్ళనవసరం లేదని ఎందుకంటే భాజపా సీఎం ఆ పని చేస్తారంటూ ఆయన చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ సోనియా కుటుంబానికి అనుకూలంగా పనిచేస్తే బారాస కేసీఆర్ కుటుంబం చెప్పు చేతుల్లో ఉందని కుటుంబ పాలనకు చరమగీతం పాడాలంటూ ఆయన తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు .తెలంగాణ భాజపా అధ్యక్షుడు కిషన్ రెడ్డి( Kishan Reddy ) మాట్లాడుతూ తెలంగాణ లో ఆత్మహత్య చేసుకున్న రైతులలో 75% మంది కౌలు రైతులే అని , కేసీఆర్ సర్కార్ గత 9 సంవత్సరాలుగా పంట బీమా పథకం అమలు చేయడం లేదని ,ఇప్పుడు కేవలం ఎన్నికల ప్రయోజనం కోసం రుణమాఫీ అమలు చేస్తున్నారని, వరి సాగు చేయవద్దు అంటూ ప్రభుత్వo పిలుపునిచ్చిన ఘటన
తెలంగాణలో మాత్రమే జరిగిందని రైతులు పట్ల ఈ రెండు పార్టీలకి చిత్తశుద్ది లేదని కేవలం వాళ్ళ ఓట్లపై ఆరాటమే తప్ప ప్రజల అభివృద్ధిపై దృష్టి లేదంటూ ఆయన చెప్పుకొచ్చారు.రైతు సమస్యలు తీర్చే శక్తి భాజపా ప్రభుత్వానికే ఉన్నదని భారాశా కి ఓటు వేసినా కాంగ్రెస్కు ఓటు వేసినా మజ్లిస్ పార్టీకి ఓటు వేసినట్టు అవుతుందంటూ ఆయన చెప్పుకొచ్చారు .తెలంగాణ రైతాంగం పట్ల వారిసమస్యల పట్ల చిత్తశుద్ధి ఉన్న భాజపాకు అవకాశం ఇవ్వాలంటూ ఆయన తెలంగాణ ప్రజలను కోరారు
.