అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించిన కస్తూరి శంకర్.. జైలులో కూడా అదే జరిగి ఉంటుంది అంటూ!

తెలుగు ప్రేక్షకులకు నటి కస్తూరి శంకర్ ( Actress Kasturi Shankar )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

ఈమె సినిమాలు,సీరియల్స్ కంటే ఎక్కువగా వివాదాలతోనే వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.

అందులో భాగంగానే ఇటీవలే ఆమె తమిళనాడులోని తెలుగు వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అరెస్ట్ అయి కొన్ని రోజులు చెన్నైలోని ఫుళల్ సెంట్రల్ జైలులో ( Phulal Central Jail, Chennai )కూడా ఉండాల్సి వచ్చిన విషయం తెలిసిందే.అయితే రిమాండ్ పూర్తి కాక ముందు కోర్టులో బెయిల్ రావడంతో కస్తూరి ఊపిరి పీల్చుకున్నారు.

ఈ వ్యవహారం తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంచలనంగా కూడా మారింది.ఈ వ్యవహారం తర్వాత సైలెంట్ గా ఉన్న కస్తూరి శంకర్ తాజాగా అల్లు అర్జున్( Allu Arjun ) అరెస్ట్ ఘటనపై స్పందించింది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో కస్తూరి శంకర్ మాట్లాడుతూ.జైలు లోపలికి వెళ్లిన తర్వాత ఒక అడ్వెంచర్ అది.స్ట్రిప్ సెర్చ్ చేస్తారు.అల్లు అర్జున్ గారికి కూడా అదే జరిగి ఉంటుంది.

Advertisement

ఎలా పుట్టామో అలా నిలబడాలి.ముట్టుకొని మరీ సెర్చ్ చేస్తారు.

బాడీలో ఎక్కడైనా ఏమైనా ఉన్నాయా ఎక్కడైనా ఏమైనా దాచుకున్నామా, బాడీ ప్రైవేట్ పార్ట్స్‌ లో ఏమైనా దాచామా అని చెక్ చేస్తారు.ఫస్ట్ ముట్టుకోరు, కానీ మూడు సార్లు గుంజీలు తీయమంటారు.

కింద కూర్చోని లేవమంటారు.అది ఖచ్చితంగా చేయాలి.

ఎందుకంటే ఏమైనా దాచుకుంటే తెలుస్తుందని అలా చేయిస్తారు.ఇది చూశాకా నార్మల్ జీవితం గడిపి జైలుకి వెళ్లిన మాలాంటి వాళ్లకే చచ్చినట్లు ఉంటుంది.

అల్లు అర్జున్ అరెస్టుపై మాట మార్చిన టాలీవుడ్ కమెడియన్... భయపడుతున్నారా?
బౌన్సర్లతో పెళ్లికి హాజరైన పల్లవి ప్రశాంత్... నీ బిల్డప్ చూడలేకపోతున్నాం అంటూ భారీ ట్రోల్స్!

కానీ మంచి లైఫ్ చాలా సౌకర్యాలు అనుభవించి మరీ ఇలా దిగిపోతే ఇంకేం అనిపిస్తుంది.

Advertisement

అసలు వాళ్లు అలా చెప్పినప్పుడు ఏంటి అన్నీ తీసేయాలా బట్టలన్నీ అంటూ మూడు సార్లు అడిగాను కానీ వాళ్లు నా పైన కోపపడకుండా శాతంగానే చెప్పారు.అర్థం చేసుకోండి మేడమ్ అంటూ చెప్పారు.వాళ్లకి వీలైనంత వరకూ వాళ్లు నన్ను గౌరవంగానే ట్రీట్ చేశారు.

కానీ బట్టలూడదీయక తప్పదు కదా చెప్పినట్లు చెయ్యాలి కదా, అందులో కన్సషన్ ఏం లేదు అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయినప్పుడు నేను ఏమనుకున్నా అంటే ఆయన జైలు లోపలికి వెళ్లరు ఆయనకి ఇంకా టైమ్ ఉంది.బెయిల్ వస్తుంది అని నేను అనుకున్నాను, కానీ తర్వాత జైలు లోపలికి వెళ్లారని తెలిసింది, అంటే ప్రిజనర్ రికార్డ్ ఉంటుంది.

ఫొటో తీసుంటారు,నెంబర్ ఇచ్చి ఉంటారు.నాకు అదంతా జరిగింది నన్ను ఒక ఫొటో తీశారు.

రికార్డ్స్‌లో నా ఫ్యామిలీ వివరాలన్నీ రాశారు.నాకు ఖైదీ నంబర్ ఇచ్చారు.6444798 నా నంబర్.ఇలా నాకు ఒక ప్రిజన్ రికార్డ్ ఉంది.లైఫ్ టైమ్ అది అక్కడ ఉంటుంది.

తప్పు చేశానా లేదా అనే తీర్పు తర్వాత వస్తుంది.కానీ జైలులో నాకు రికార్డ్ ఉంటుంది.

నాకూ ఉంది, అక్కడ మర్డర్ కేసులో నిందితులకి ఉంది, గంజాయ్ అమ్మిన వాళ్లకి కూడా ఉంది.వాళ్లతోనే నేను క్వారంటైన్ బిల్డింగ్‌ లో ఉన్నాను అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు కస్తూరి శంకర్.

తాజా వార్తలు