జూనియర్ ఎన్టీఆర్ నుంచి సాయం అందలేదు.. కౌశిక్ తల్లి సంచలన వ్యాఖ్యలు వైరల్!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్(Young Tiger Jr.NTR) అభిమానులు కష్టంలో ఉంటే సహాయం చేసే విషయంలో ముందువరసలో ఉంటారనే సంగతి తెలిసిందే.కౌశిక్ (Kaushik)అనే అభిమాని బోన్ క్యాన్సర్ తో బాధ పడుతుండగా తారక్ ఆ అభిమానికి తన వంతు సహాయం చేస్తానని కొంతకాలం క్రితం మాట ఇచ్చారు.అయితే కౌశిక్ తల్లి మాత్రం జూనియర్ ఎన్టీఆర్(Jr.

 Bone Cancer Patient Kaushik Mother Says Junior Ntr Did Not Helped Me , Young Ti-TeluguStop.com

NTR) నుంచి ఏ సహాయం అందలేదని చెబుతుండటం గమనార్హం.

Telugu Cm, Jr Ntr Tdp, Kaushiks Mother, Krishna Yadav-Movie

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం తమకు రెండున్నర లక్షల రూపాయలు సహాయం చేశారని కౌశిక్ తల్లి(Kaushik’s mother ) అన్నారు.సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 11 లక్షల రూపాయలు, టీటీడీ(TDP) నుంచి 40 లక్షల రూపాయలు సహాయం అందిందని కౌశిక్ తల్లి వెల్లడించారు.మరో 20 లక్షల రూపాయలు చెల్లిస్తే మాత్రమే మా కొడుకును డిశ్చార్జ్ చేస్తామని చెబుతున్నారని ఆమె ఎమోషనల్ అయ్యారు.

సహాయం చేస్తానని మాటిచ్చిన జూనియర్ ఎన్టీఆర్ కొరకు ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం లేకుండా పోయిందని ఆమె వెల్లడించారు.జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షుడు కృష్ణ యాదవ్(Krishna Yadav) కు ఫోన్ చేశామని, జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయ సిబ్బందికి సైతం ఫోన్ చేశామని వాళ్ల నుంచి సరైన స్పందన లేదని ఆమె పేర్కొన్నారు.

ఈ కామెంట్ల గురించి జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

Telugu Cm, Jr Ntr Tdp, Kaushiks Mother, Krishna Yadav-Movie

నెటిజన్లు మాత్రం తారక్ జోక్యం వల్లే సీఎం రిలీఫ్ ఫండ్(CM Relief Fund) నుంచి, టీటీడీ నుంచి సహాయం అందిందని తారక్ ను నిందించవద్దని కోరుతున్నారు.ఎన్టీఆర్ ను టార్గెట్ చేసి కామెంట్లు చేయడం ఎంతవరకు రైట్ అని అభిప్రాయపడుతున్నారు.ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉండవచ్చని తారక్ పై అభాండాలు మోపడం మాత్రం సరికాదని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్2 సినిమాతో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube