ఏడ్చే రోజు వచ్చేసింది చూడు .. పాపా జో బాలీవుడ్ నిర్మాత పై కంగనా కామెంట్స్!

బాలీవుడ్ కాంట్రవర్సీ బ్యూటీ కంగనా రనౌత్ ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు ఉంటాయనే విషయం మనకు తెలిసిందే.ఇక ఏ విషయం గురించి అయినా ముక్కుసూటిగా, కుండబద్ధలు కొట్టినట్లు మాట్లాడే వ్యక్తిత్వం గల కంగనా రనౌత్ సోషల్ మీడియా వేదికగా ఎలాంటి పోస్టులు చేసిన సంచలనంగా మారుతుంటాయి.

 Kangana Comments On Papa Joe Bollywood Producer And Said Ready For Crying , Kang-TeluguStop.com

ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో కంగనా, ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ మధ్య ఉన్న శత్రుత్వం గురించి అందరికీ తెలిసిందే.

Telugu Bollywood, Kangana, Kangana Ranaut, Karan Johar, Lockupreality, Papa Joe,

గతంలో కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన కాఫీ విత్ కరణ్ షోకు సల్మాన్ ఖాన్ తో కలిసి వెళ్లిన ఈమె ఏకంగా కరణ్ జోహార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.కరణ్ నెపోటిజానికి సూత్రధారి, సినిమా మాఫియా లాంటివాడని అనటంతో వీరిద్దరి మధ్య శత్రుత్వం మొదలైంది.అప్పటి నుంచి ఏ చిన్న అవకాశం దొరికినా కరణ్ జోహార్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తోంది.

తాజాగా మరోసారి నిర్మాత కరణ్ జోహార్ పై కంగనా షాకింగ్ కామెంట్స్ చేశారు.

Telugu Bollywood, Kangana, Kangana Ranaut, Karan Johar, Lockupreality, Papa Joe,

ప్రస్తుతం కంగనా సినిమాలలో మాత్రమే కాకుండా లాకప్ రియాలిటీ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే.తాజాగా ఈ షో 200 మిలియన్‌ వ్యూస్ సాధించడంతో కంగనా సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు.లాకప్ రియాలిటీ షో మిలియన్ వ్యూస్ సంపాదించుకోవడంతో కొందరు ఏడవడానికి సిద్ధమయ్యారు.

నువ్వు కూడా ఏడ్చే రోజు వచ్చేసింది చూడు .పాపా జో” అంటూ కంగనా పోస్ట్ చేశారు.ఇక ఈమె చేస్తున్న ఈ పోస్ట్ చూస్తే తప్పకుండా కరణ్ జోహార్ ను ఉద్దేశిస్తూ చేసిన పోస్ట్ అని స్పష్టంగా తెలుస్తోంది.మరి ఈమె చేసిన ఈ వ్యాఖ్యలపై నిర్మాత ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube