చిరంజీవికి అల్లు అర్జున్ కు పోలికే లేదు.. ఆయనతో పోల్చకండి.. అల్లు బాబీ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కుమారుడిగా అల్లు బాబీ అలియాస్ వెంకట్ తన తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని నిర్మాతగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఈయన వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కిన గని చిత్రం ద్వారా నిర్మాతగా మారారు.

 Allu Bobby Interesting Comments On Chiru And Allu Arjun Details, Allu Arjun, Ch-TeluguStop.com

ఇక ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది.ఈ క్రమంలోనే ఈ సినిమాని ఏప్రిల్ 8 వ తేదీ విడుదల చేయడానికి చిత్ర బృందం అన్ని ఏర్పాట్లు చేశారు.

సినిమా విడుదల తేది దగ్గర పడటంతో పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలోనే నిర్మాత అల్లు బాబీ పలు ఇంటర్వ్యూలలో పాల్గొని ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి వెల్లడించారు.

ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అల్లు బాబీకి మెగాస్టార్ చిరంజీవిని అల్లు అర్జున్ ని ఎలా పోల్చి చూస్తారనే ప్రశ్న ఎదురైంది.ఈ ప్రశ్నకు అల్లు బాబీ సమాధానం చెబుతూ… అల్లు అర్జున్ ను చిరంజీవి గారితో పోల్చవద్దని తెలియచేశారు.

Telugu Allu Aravind, Allu Arjun, Allu Bobby, Bunny, Chiranjeevi, Tollywood, Venk

చిరంజీవి గారు స్వయంకృషితో మెగాస్టార్ గా ఎదిగారు.ఆయన మాకు ఎంతో ఇన్స్పిరేషన్.మేము అల్లు రామలింగయ్య మనవల్లుగా, అల్లు అరవింద్ కొడుకులుగా కెరియర్ ప్రారంభించామని, చిరంజీవి స్ఫూర్తితో కష్టపడ్డామని, అల్లు బాబీ తెలిపారు.అలాంటి చిరంజీవిగారితో మమ్మల్ని పోల్చి చూడటం కరెక్ట్ కాదని ఈ సందర్భంగా బాబీ తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube