సంగీత దర్శకుడు దేవిశ్రీ కి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన కమల్ హాసన్!

తెలుగు చిత్ర పరిశ్రమలో సంగీత దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న దేవిశ్రీప్రసాద్ కు గత కొద్ది కాలంగా అనుకున్న హిట్ పడలేదని చెప్పాలి.ఇక సినీ ఇండస్ట్రీలో ఈయన కెరియర్ ముగిసిందనుకునే సమయంలో పుష్ప సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు.

 Kamal Haasan Surprise Gift ,music Director Devi Sree ,devi Sri Prasad, Pushpa 2-TeluguStop.com

ఈ సినిమాలోని పాటలు మొదట్లో కాస్త ట్రోలింగ్ ఎదుర్కొన్నప్పటికీ ఆ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో ఈ పాటలకు ఎంతో మంచి ఆదరణ వచ్చింది.ఇప్పటికీ ఏ కార్యక్రమానికి వెళ్లిన పుష్ప సినిమాలో పాటలు వినపడుతూనే ఉంటాయి.

ఈ విధంగా పుష్ప సినిమా దేవి శ్రీ ప్రసాద్ కెరియర్ కు మంచి బూస్ట్ ఇచ్చిందని చెప్పాలి.ఇలా పుష్ప సినిమాతో ఎంతో మంచి క్రేజ్ సంపాదించుకున్న దేవిశ్రీ ప్రస్తుతం పుష్ప 2 సినిమా పనులతో బిజీగా ఉన్నారు.

ఇలా పుష్ప సినిమా పనులతో బిజీగా ఉన్నటువంటి దేవిశ్రీకి లెజెండరీ నటుడు కమల్ హాసన్ అద్భుతమైన కానుకను ఇచ్చే సర్ప్రైజ్ చేశారు.అయితే ఈ గిఫ్ట్ మాత్రం మ్యూజిక్ భాషలో ఉండడం గమనార్హం.

అయితే కమల్ హాసన్ ఇచ్చినటువంటి ఈ గిఫ్ట్ ను దేవిశ్రీ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

2022వ సంవత్సరంలో నేను అందుకున్న మరొక తీపి జ్ఞాపకం కమల్ హాసన్ సర్ నా కోసం అమెరికా నుంచి ఈ కానుకను పట్టుకొచ్చారు.నాపై ఉన్న ప్రేమతో చేతితో తయారుచేసిన పుస్తకం అందులో మ్యూజిక్ కొటేషన్స్.కవర్ మీద ఆయన మాటలు, సంతకం ఉన్నాయి.

ఇందులో నా బిడ్డ.ఇది మీ అడ్డా.

అంటే.మై కిడ్.

దిజ్ ఈజ్ యువర్ అడ్డా అని అర్థం.ఈ విధంగా కమల్ హాసన్ గారు పుష్ప లైన్స్‌ను నాకోసం ఇలా వాడారు.

నేనెంత అదృష్టవంతుడ్ని అంటూ ఎమోషనల్ పోస్ట్ చేయడమే కాకుండా ఆయనతోపాటు తన కారులో ప్రయాణిస్తూ కలిసి దిగినటువంటి ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube