ప్రముఖ దేశీయ టెలికాం దిగ్గజం జియో ఎప్పటికప్పుడు ఆఫర్లను ప్రకటిస్తూ తన వినియోగదారుల సంఖ్యను పెంచుకుంటూ పోతోంది.ఈ క్రమంలో ఇతర టెలికాం సంస్థలు జియోతో పోటీలో నిలవలేకున్నాయి.
అవును, జియో ఆఫర్ల దాటికి తట్టుకోలేక మార్కెట్లో నిలదొక్కుకునేందుకు ఎయిర్ టెల్ , ఐడియా, వొడాఫోన్ వంటి టెలికాం సంస్థలు నానా అవస్థలు పడటం మనకు కనబడుతోంది.ఇప్పుడు తాజాగా మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు జియో.
మరో ఆఫర్ని ప్రవేశపెట్టింది.అయితే ఈ ఆఫర్ సాధారణ యూజర్లకు మాత్రం కాదు.
విషయం ఏమంటే, జియో ‘‘ఫుట్ బాల్ ఆఫర్’’ పేరిట ఈ బంపర్ ఆఫర్ ప్రకటించడం కొసమెరుపు.ఈ ఆఫర్ కింద ఈ స్మార్ట్ ఫోన్ యూజర్లకు దాదాపుగా రూ.2,200 వరకు ఇన్‌స్టాంట్ క్యాష్ బ్యాక్ అందించనుంది.అయితే ఇక్కడ కొన్ని నియమనిబంధనలు వున్నాయి.
షియోమి, మోటోరోలా, శాంసంగ్, ఆసుస్, పానసోనిక్, హువావే, ఎల్‌జీ, నోకియా, మైక్రోమ్యాక్స్ వంటి పలు డివైజ్‌లను కొనుగోలు చేసే కస్టమర్లకు ఈ జియో ఫుట్‌బాల్ ఆఫర్ అనేది వర్తిస్తుందని గుర్తుపెట్టుకోవాలి.
ఇకపోతే సదరు ఆఫర్ క్రింద ప్రీపెయిడ్ ప్లాన్లు 198 రూపాయలు లేదా 299 రూపాయలలో అవైలబుల్ వున్నాయి.దీంతో యూజర్లకు 44 జియో ఓచర్లు మైజియో అకౌంట్‌లో వెంటనే క్రెడిట్ అవుతాయి.ఒక్కో ఓచర్ విలువ రూ.50 అని అర్ధం.కాగా వీటిని తర్వాత రీఛార్జ్ రూపంలో వాడుకోవచ్చు.
కొత్త, పాత జియో కస్టమర్లందరికీ ఈ ఫుట్‌బాల్ ఆఫర్ వర్తిస్తుందని భోగట్టా.మైజియో యాప్ ద్వారా మార్చి 31 వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని కంపెనీ చెప్పింది.
ఈ ఆఫర్ కింద వచ్చిన ఓచర్లను యూజర్లు సద్వినియోగం చేసుకోకపోతే, 2022 మార్చి 31న ఎక్స్ పైర్ అయిపోతాయి.