రాజకీయం కోసం మోడీ భార్యని వదలని...బీజేపీ

పార్టీ కి హైప్ వస్తుందని అనుకుంటే ఏమి చేయడానికైనా సిద్దంగా ఉన్నారు రాజకీయ పార్టీ నేతలు.

అందుకు గాను వారు చేసే జిమ్మిక్కులు అన్నీ ఇన్నీ కావు అయితే.

ఇలాంటి రాజకీయాలు చేయడంలో ముఖ్యంగా బీజేపి పార్టీ కి వెన్నతో పెట్టిన విద్య అయితే ఈ సారి బీజేపి తన రాజకీయాలకోసం ఏకంగా ప్రధాని మోడీ వైవాహిక జీవితాన్ని ఎంచుకుంది.అయితే ఈ ఘటనతో ఒక్కసారిగా మోడీ భార్య .జశోదాబెన్ ఫైర్ అయ్యారు మీ నీచ రాజకీయాలకోసం నన్ను ఇంతకీ దిగాజారుతారా అంటూ ప్రశ్నించారు.అసలేం జరిగింది అనే వివరాలలోకి వెళ్తే.

Jashodaben Refutes Anandiben Patels Remark

గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి.మధ్యప్రదేశ్ ప్రస్తుత గవర్నర్ ఆనందీ బెన్, రెండు రోజుల క్రితం ఒక కార్యక్రమంలో "మీకు ఒక విషయం తెలుసా, నరేంద్రభాయి మోదీ పెళ్లి చేసుకోలేదు.అయినా, ఆయన మహిళలు, పిల్లల బాధను అర్థం చేసుకోగలరు" అంటూ బీజేపి ప్రభుత్వానికి లబ్ది చేకూర్చేలా మాట్లాడారు.

ఈ వ్యాఖ్యలపై మోడీ జీ భార్య జశోదాబెన్ విచారం వ్యక్తం చేశారు.గవర్నర్ ఆనందీబెన్ చేసిన ఆ వ్యాఖ్యలపై, జశోదాబెన్, ఆమె కుటుంబ సభ్యులు చాలా కలత చెందుతున్నారు.

Advertisement
Jashodaben Refutes Anandiben Patels Remark-రాజకీయం కోసం �

"నరేంద్ర మోదీకి పెళ్లైందని అందరికీ తెలుసు, అయినా జనం అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు" అని జశోదాబెన్ అన్నారు.అయితే గవర్నర్ ఆనందీబెన్ మాటలు అసత్యాలని.రాజకీయాలు చేసుకోవాలి అంటే ఇంతకి దిగాజారిపోవాలా ఇదేనా మీరు ప్రజలకి చెప్పేది అంటూ జశోదాబెన్ ఫైర్ అయిపోయారు.

రాజకీయ కారణాలతోనే ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు."రాజకీయాల కోసం నరేంద్రమోదీ, జశోదాబెన్ గురించి అబద్ధాలు ప్రచారం చేయడం సరికాదు" అని జశోదాబెన్ సోదరుడు అశోక్ మోదీ అన్నారు.

ఇదిలాఉంటే.నరేంద్ర మోదీ 2002, 2007, 2012లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల కోసం సమర్పించిన నామినేషన్ పత్రాల్లో తన వైవాహిక స్థితి గురించి ఎలాంటి వివరాలూ ఇవ్వలేదు.

అయితే 2014లో లోక్‌సభ ఎన్నికలకు ముందు తన అధికారిక అఫిడవిట్‌లో తనకు వివాహం అయ్యిందని మోదీ మొదటిసారి అంగీకరించారు.ఆయన నామినేషన్ పత్రాల్లో, జశోదాబెన్‌ను తన భార్యగా పేర్కొన్నారు.

శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
మంచు ఫ్యామిలీ జరుగుతున్న గొడవలు కన్నప్ప మీద ఎఫెక్ట్ చూపిస్తాయా..?

అయితే జశోదాబెన్ వ్యాఖ్యలని కాంగ్రెస్ ప్రభుత్వం క్యాష్ చేసుకుంటోంది.జశోదాబెన్ ని భార్యగా సమాజానికి చెప్పుకోవాడానికి మోడీ జీ కి ఎందుకు నోరు రావడం లేదు.

Advertisement

స్త్రీలపై.వారి సమస్యలపై మోడీ కి ఎలాంటి చిత్తశుద్ధి ఉందొ అర్థం అవుతోంది అంటూ కాంగ్రెస్ నేతలు మాటల దాడి అప్పుడే మొదలు పెట్టేశారు పనిలో పనిగా మహిళా సంఘాలతో చర్చలు చేయించి మరీ బీజేపి పరువు గంగలో కలుపుతున్నారు కాంగ్రెస్ నేతలు.

తాజా వార్తలు