ఎన్నికల్లో పోటీపై జలగం సుధీర్ ఆసక్తికర వ్యాఖ్యలు...!

సూర్యాపేట జిల్లా:రాబోయే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్ళీ టిక్కెట్ ఇస్తామని సీఎం కేసీఆర్( CM KCR ) ప్రకటించడంతో పలు నియోజకవర్గాల్లో అధికార పార్టీ నుండి టిక్కెట్ ఆశిస్తున్న ఆశావాహులు పక్క చూపులు చూస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఇందులో భాగంగానే సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ టిక్కెట్ రేసులో ఉన్న ఎన్ఆర్ఐ జలగం సుధీర్( Jalagam Sudhir ) మంగళవారం ఒక బ్రీఫ్ ప్రెస్ నోట్ విడుదల చేశారు.

అందులో ఆయన తన రాజకీయ భవిష్యత్ పై పలు ఆసక్తికర అంశాలు వెలువరించారు.తాను గత 2018లో బీఆర్ఎస్ టిక్కెట్ ఆశించి నామినేషన్ వేసినా పార్టీ అధిష్టానం మాట మీద గౌరవంతో నామినేషన్ విత్ డ్రా చేసుకున్నానని,2021 నుండి పార్టీలో ఉన్నప్పటికీ ఎటువంటి పదవి ఆశించక నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేశానని,2023 ఎన్నికల్లో కూడా పోటీ చేయకపోతే నియోజకవర్గంలో వ్యక్తిగతంగా ఆస్తిత్వం కోల్పోయే ప్రమాదం ఉందని ఎన్ఆర్ఐ జలగం సుధీర్ అన్నారు.

కొంతమంది స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని సూచనలు చేస్తున్నారని,కాంగ్రెస్, బీజేపీ నేతలు పార్టీలోకి రావాలని ఒత్తిడి చేస్తున్నారని,బీఎస్పీ అయితే నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయమని అడుగుతున్నారని,ఆమ్ ఆద్మీ పార్టీ న్యూఢిల్లీలోని ఒకరిద్దరు ఎమ్మెల్యే ద్వారా ఆ పార్టీలోకి రమ్మని ఆహ్వానించారని మనసులో మాటను బయటపెట్టారు.ఈ మధ్య కాలంలో అమెరికాలో పర్యటనకు వెళ్లిన మంత్రి కేటీఆర్ ( Minister KTR )కు అన్ని వివరాలు చెప్పానని.2001 నుండి టిఆర్ఎస్ అధిష్టానం దృష్టిలో మంచి పేరుతో పాటు,కోదాడ నియోజవర్గంలో అనేక సామాజిక,ఆర్ధిక,రాజకీయ,అవినీతి,అసాంఘిక కార్యకలాపాలపై ప్రజలను చైతన్యం చేయడంతో పాటు,సేవా కార్యక్రమాలు చేయడం వల్ల పార్టీ మారడం మీద పెద్దగా ఆసక్తి చూపట్లేదని అన్నారు.సీఎం కేసీఆర్ అవకాశమిస్తే పోటీ చేస్తానని,ఇప్పటికే కేటీఆర్ ను కలిసి వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేశానని తెలిపారు.

కోదాడ ప్రాంతం నుండి ఫీడ్ బ్యాక్ బాగానే ఉందని,అదే విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని కేటీఆర్ అన్నారని చెప్పారు.కానీ,పరిస్థితి వేరేలా ఉందని,ఇలాంటి పరిస్థితుల్లో సైలెంట్ గాతన రాజకీయ,వ్యక్తిగత ప్రమాదం జరిగే అవకాశం ఉందని,పార్టీ టిక్కెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా కోదాడ నుండి ఈసారి పోటీపై ఆత్మీయులతో చర్చలు జరుపుతున్నానని అందరి సలహా మేరకు ముందుకు వెళతానని చెప్పుకొచ్చారు.

Advertisement

ఒకవేళ ఏదైనా ప్రధాన పార్టీ నుండి ఆఫర్ వస్తే ఏం చేయాలి? లేదా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండాలా? అనే అంశాలపై సహచర ఎన్ఆర్ఐలతో,కోదాడ ప్రాంత శ్రేయోభిలాషులతో మాట్లాడక భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని గులాబీ పార్టీకి గులాబ్ జామ్ లాంటి స్వీట్ వార్నింగ్ ఇయ్యకనే ఇచ్చారని చెప్పొచ్చు.

పోటెత్తుతోన్న ఎన్ఆర్ఐ పెట్టుబడులు .. త్రివేండ్రంలో రియల్ ఎస్టేట్ బూమ్
Advertisement

Latest Suryapet News