జగన్ ఢిల్లీ టూర్ ! అందరికీ టెన్షనే ?

వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ ( CM jagan )ఢిల్లీ టూర్ ఆసక్తికరంగా మారింది.ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో టిడిపి అధినేత చంద్రబాబు అరెస్ట్ అయ్యారు .

 Ysrcp, Ap, Tdp, Chandrababu, Jagan , Jagan Delhi Tour, Modhi, Amith Sha-TeluguStop.com

ఆ సమయంలో జగన్ లండన్ పర్యటనలో ఉన్నారు.ఇక పర్యటనను ముగించుకుని వచ్చిన జగన్ నేడు ఢిల్లీకి వెళ్తున్నారు.

అయితే జగన్ ఆకస్మిక ఢిల్లీ టూర్ వెనుక కారణాలు ఏమిటి ?  చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో కేంద్ర బిజెపి పెద్దలతో ఆ విషయంపై చర్చించేందుకు వెళ్తున్నారా ? మరి ఏదైనా రాజకీయ కారణాలు ఉన్నాయా అనేది అందరికీ ఉత్కంఠ కలిగిస్తోంది.ఈనెల 18 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగబోతున్న నేపథ్యంలో,  జగన్ ఢిల్లీ టూర్ కి వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Telugu Amith Sha, Chandrababu, Jagan, Jagan Delhi, Modhi, Ysrcp-Politics

ఈరోజు ఢిల్లీలో కేంద్ర బిజెపి పెద్దలతో జగన్ ప్రత్యేకంగా భేటీ కానున్నారు.వ్యక్తిగత పర్యటన నిమిత్తంలో జగన్ అక్కడి నుంచి రాగానే ఢిల్లీకి వెళ్తుండడంతో కేంద్ర బిజెపి పెద్దలే జగన్ ను రావలసిందిగా ఆదేశించారా లేక ,  చంద్రబాబు అరెస్ట్ ( Chandrababu arrested )నేపథ్యంలో జగన్ కేంద్ర బీజేపీ పెద్దలతో ఆ అంశం చర్చించేందుకు ఢిల్లీకి వెళ్తున్నారా అనేది తేలాల్సి ఉంది.ప్రస్తుతం దేశంలో జమిలి ఎన్నికల కు సంబంధించిన హడావుడి జరుగుతుంది.18 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో జగన్ ఢిల్లీకి వెళ్తుండడం వెనుక కారణం అయ్యి ఉండొచ్చనే అనుమానాలు కలుగుతున్నాయి.లోక్ సభ,  అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికల నిర్వహించాలని కేంద్రం భావిస్తుంది.

Telugu Amith Sha, Chandrababu, Jagan, Jagan Delhi, Modhi, Ysrcp-Politics

 ఏపీ ప్రభుత్వానికి జూన్ వరకు గడువు ఉండడంతో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలా లేక సాధారణ ఎన్నికలకు వెళ్లాలా అనే సందిగ్ధం లో జగన్ ( CM jagan )ఉన్నారు.పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో  ఈ బిల్లు గనుక పెడితే వైసీపీ మద్దతు కోసం  పిలిచి ఉండవచ్చే అనుమానాలు కూడా ఉన్నాయి.జగన్ బహిరంగంగా ఎక్కడ స్పందించలేదు.

కేంద్ర బీజేపీ పెద్దలు సూచనలతోనే చంద్రబాబు అరెస్ట్ జరిగిందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు కేంద్ర బిజెపి పెద్దలతో జగన్ భేటీ కాబోతుండడం ఉత్కంఠ రేపుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube