టికెట్ల రేట్లు విషయంలో జగన్ కరెక్ట్.. మేమంతా జోకర్స్అయ్యాము: వర్మ

గత కొన్ని రోజుల క్రితం ఏపీ ప్రభుత్వం టికెట్ల రేట్లను తగ్గిస్తూ జీవో విడుదల చేయడంతో ఒక్కసారిగా ఈ విషయంపై పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది.ఈ క్రమంలోనే సినీ పరిశ్రమకు ఏపీ ప్రభుత్వానికి మధ్య చిన్నపాటి యుద్ధమే నడిచిందని చెప్పాలి.

 Jagan Is Correct About Ticket Rates We All Became Jokers By Verma , Ram Gopal Va-TeluguStop.com

ఇక టికెట్ల వివాదంపై ఇటు ఏపీ మంత్రులకు ఇటు సినీ సెలబ్రిటీల మధ్య మాటల యుద్ధం కొనసాగింది.ముఖ్యంగా ఈ విషయంపై దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందిస్తూ పెద్దఎత్తున వార్తల్లో నిలిచారు.

చివరికి సినీ పెద్దల విజ్ఞప్తి మేరకు ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల రేట్లు పెంచారు.

ఇక తెలంగాణలో యధావిధిగా సినిమా టికెట్ల రేట్లు భారీగానే ఉన్నాయి.

ఏపీలో కూడా సినిమా టికెట్ల రేట్లను పెంచడంతో సిని సెలబ్రిటీలు హర్షం వ్యక్తం చేశారు.ఇలా సినిమా టికెట్ల రేట్లు పెంచడంతో భారీ బడ్జెట్ చిత్రాలు అయినా RRR వంటి సినిమాలను మల్టీప్లెక్స్ లో చూడాలంటే ఏకంగా 500 రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఇలా ఒకేసారి అధికంగా టికెట్ల రేట్లు పెంచడంతో సామాన్యులు థియేటర్ కి వచ్చి సినిమా చూడటానికి ఆసక్తి చూపించలేదు.సినిమా ఎలాగో థియేటర్లలో విడుదలైన నెలకు ఓటీటీలో విడుదల అవుతుందన్న భావనలో థియేటర్ కి వెళ్లి సినిమా చూసే వారి సంఖ్య తగ్గిపోయింది.

Telugu Ap Ticket Rates, Cine, Cm Jagan, Ram Gopal Varma, Telugu, Tollywood-Movie

ఇలా సినిమా టికెట్ల రేట్లు పెంచడంతో లాభం కన్నా నష్టమే అధికంగా ఉందని భావించిన నిర్మాతల ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి.అందుకే ఎఫ్ 3 సినిమా టికెట్ల రేట్లను ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే అందుబాటులోకి తెచ్చారు.తాజాగా విడుదలైన విరాటపర్వం సినిమాని ప్రభుత్వం నిర్ణయించిన ధరలకన్నా తక్కువగా అందుబాటులోకి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.తాజాగా ఈ విషయంపై స్పందించిన రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ జగన్ సినిమా టికెట్ల రేట్లను తగ్గించి సినీ పరిశ్రమను తొక్కేయాలని భావించింది అనుకున్నాము కానీ జగన్ తన ఆలోచనలతో చిత్రపరిశ్రమను పైకి లేపాలని ఆలోచించారని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాము.

జగన్ టికెట్ల విషయంలో తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ ఈ విషయంలో మేమంతా జోకర్స్ అయ్యామని వర్మ వెల్లడించారు.ప్రస్తుతం వర్మ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube