ఇకపై హరీష్‌రావుతో గొడవలుండవు

14 ఏళ్ల రాజకీయ వైరంను తన నియోజక వర్గం కోసం పక్కన పెడుతున్నట్లుగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పుకొచ్చాడు.సుదీర్ఘ కాలంగా టీఆర్‌ఎస్‌ ముఖ్య నేత హరీష్‌ రావుతో జగ్గారెడ్డికి విరోదాలు ఉన్నాయి.

 Jagaa Reddy Comments On Harish Rao Trs Telugu Latest Updates Trspolitiocal War-TeluguStop.com

ఇద్దరు కూడా పలు సారు ఢీ అంటే ఢీ అంటూ గొడవకు దిగారు.అలాంటి ఇద్దరు ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్బంగా దాదాపు 30 నిమిషాలు మాట్లాడుకున్నారు.14 ఏళ్ల తర్వాత వీరిద్దరు మాట్లాడుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది.ఇక తాజాగా మరోసారి ఆ విషయమై ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఇన్నాళ్లు హరీష్‌ రావుతో ఉన్న విభేదాలకు స్వస్థి చెప్పాలని నిర్ణయించుకున్నట్లుగా చెప్పుకొచ్చాడు.సంగారెడ్డి అభివృద్ది కోసం ఆయనతో కలిసి పని చేయాలని భావిస్తున్నాను.ఇకపై హరీష్‌ రావుతో ఎలాంటి విభేదాలు ఉండవని జగ్గారెడ్డి చెప్పుకొచ్చాడు.కేసీఆర్‌ ప్రభుత్వంపై నమ్మకంతో ప్రజలు మరోసారి టీఆర్‌ఎస్‌కు ఓటు వేసి గెలిపించారు.

అందుకే మేమేం విమర్శించినా కూడా ప్రజలు నమ్మరు.అందుకే ఇకపై ప్రభుత్వంకు మద్దతుగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా ఆయన చెప్పుకొచ్చాడు.

ఆయన వ్యాఖ్యలు టీఆర్‌ఎస్‌ వైపుకు దగ్గరగా ఆయన జరుగుతున్నారా అనే అనుమానాలను వ్యక్తం అయ్యేలా ఉన్నాయి.మరి ముందు ముందు ఏం జరుగబోతుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube