Tarakaratna : నిర్మాత అవమానిస్తే తారకరత్న వచ్చి అలా చేశాడు.. తారకరత్న ఎంతో గ్రేట్ అంటూ?

తారకరత్న( Tarakaratna ) నటుడిగా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోయినా మంచి మనిషిగా పేరు సంపాదించుకున్నారు.తారకరత్న మృతి చెందిన సమయంలో అభిమానులు ఎంత బాధ పడ్డారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

 Jabardasth Rajamouli Comments About Tarakaratna Greatness Details-TeluguStop.com

జబర్దస్త్ రాజమౌళి( Jabardasth Rajamouli ) ఒక ఇంటర్వ్యూలో తారకరత్న గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు.చిరంజీవి గారు నన్ను గుర్తుపట్టడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని జబర్దస్త్ రాజమౌళి అన్నారు.

చిరంజీవి సినిమాలకు టికెట్లు దొరక్క ఇబ్బందులు పడిన సందర్భాలు ఉన్నాయని ఆయన తెలిపారు.చిరంజీవి గారి( Chiranjeevi ) డ్రింకింగ్ యాక్టింగ్ నాకు చాలా ఇష్టమని జబర్దస్త్ రాజమౌళి వెల్లడించారు.

ఒక ప్రొడ్యూసర్ స్క్రిప్ట్ ఇచ్చారా అని అడగగా నేను ఇప్పుడే వచ్చానని చెప్పానని ఆ సమయంలో నిర్మాత ఇప్పుడు వస్తే ఎప్పుడు నేర్చుకుంటావయ్యా అని కామెంట్ చేశారని జబర్దస్త్ రాజమౌళి వెల్లడించారు.

Telugu Script, Shafi, Tarakaratna-Movie

స్క్రిప్ట్ ప్రిపేర్ కాకుండా తారకరత్న, షఫి ముందు ఎలా చేస్తావని ఆ నిర్మాత ప్రశ్నించారని ఆయన అన్నారు.పద్ధతి కాదని ఆ నిర్మాత( Producer ) కామెంట్ చేయడంతో పాటు ఎవరు తీసుకున్నారంటూ అవమానించారని జబర్దస్త్ రాజమౌళి వెల్లడించారు.ఆ సమయంలో తారకరత్న గారు వచ్చి నిర్మాత ముందే నన్ను హగ్ చేసుకున్నారని ఆయన అన్నారు.

ఆ సమయంలో షఫి అన్న కూడా షేక్ హ్యాండ్ ఇచ్చారని జబర్దస్త్ రాజమౌళి చెప్పుకొచ్చారు.

Telugu Script, Shafi, Tarakaratna-Movie

వాళ్లు అలా చేయడంతో ప్రొడ్యూసర్ ఆశ్చర్యపోయాడని ఆయన కామెంట్లు చేశారు.ఆ సమయంలో తారకరత్న నిర్మాతను నిలిచి రాజమౌళి జబర్దస్త్ స్టేజ్ పై గంట సమయం కూడా స్క్రిప్ట్ చూడకుండా చేయగలరని ఎందుకు అంత చిన్నచూపు చూస్తున్నారని ప్రశ్నించడంతో నిర్మాత కంగు తిన్నాడని జబర్దస్త్ రాజమౌళి కామెంట్లు చేశారు.జబర్దస్త్ రాజమౌళి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తారకరత్న గొప్పదనాన్ని( Tarakaratna Greatness ) ఎంత ప్రశంసించినా తక్కువేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube