నా ఇంటిని కూల్చింది ఎమ్మెల్యే సైదిరెడ్డినే

సూర్యాపేట జిల్లా:స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డినే తన ఇంటిని కూల్చి వేయించాడని హుజూర్ నగర్ ఎంపీపీ గూడెపు శ్రీనివాస్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

సోమవారం ఆయన హుజూర్ నగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డారు.

దీనితో అధికార టీఆర్ఎస్ పార్టీలో నివురుగప్పిన నిప్పులా ఉంటున్న వర్గ విబేధాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ఒక బీసీ రజక సామాజిక వర్గానికి చెందిన తాను నాయకుడిగా ఎదుగుతుంటే ఓర్వలేక,స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఉద్దేశ పూర్వకంగానే హుజూర్ నగర్ లోని నా ఇంటిపైకి మున్సిపల్ మరియు పోలీసు అధికారులను ఉసిగొల్పి అన్యాయంగా,అక్రమంగా,దౌర్జన్యంగా బలప్రయోగం చేసి,తనను అరెస్ట్ చేసి,జేసీబీతో నిర్మాణం జరుగుతున్న ఇంటిని కూల్చివేయించాడని ఆరోపించారు.

It Was MLA Saidireddy Who Demolished My House-నా ఇంటిని కూ�

ఎమ్మెల్యే సైదిరెడ్డి భూ కబ్జాలకు పాల్పడ్డాడని,తానెక్కడా భూ కబ్జాలు చేయలేదని,ఇంటికి సంబంధించిన అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయని,వాటితోనే కోర్టును ఆశ్రయించానని,కోర్టు నాకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందని తెలిపారు.కానీ,ఎమ్మెల్యే సైదిరెడ్డి తమ కులహంకారాన్ని ప్రదర్శిస్తూ నియోజకవర్గ పరిధిలోని ఎవరినీ ఎడగకుండా గుత్తాధిపత్యం లెక్క వ్యవహరిస్తూ ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు.

అన్ని ఆధారాలున్నా,కోర్టు అనుమతి ఉన్నా ఎమ్మెల్యే సైదిరెడ్డి నా ఇంటిని కూల్చివేయించి నన్ను పోలీసులచే అరెస్ట్ చేయించారని,సొంత పార్టీ ఎంపీపీకే ఈ పరిస్థితి ఉంటే ఇక మామూలు ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.ఎమ్మెల్యే వైఖరిపై పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేస్తానని తెలిపారు.

Advertisement

ఈ కార్యక్రమంలో రజక ఎస్సీ సాధన సమితి నేతలు పాల్గొన్నారు.

కానిస్టేబుల్ రాంబాబు మృతి బాధాకరం : ఎస్పీ నరసింహ
Advertisement

Latest Suryapet News