సీనియర్ స్టార్.టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జునకి ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తుందని చెప్పొచ్చు.
ఆయన చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వట్లేదు.ఈ ఇయర్ మొదట్లో బంగార్రాజు సినిమాతో హిట్ అందుకున్న నాగార్జున రీసెంట్ గా వచ్చిన ది ఘోస్ట్ సినిమాతో మరో ఫ్లాప్ తన ఖాతాలో వేసుకున్నాడు.
ప్రవీణ్ సత్తారు డైరక్షన్ లో వచ్చిన ఈ మూవీ అంచనాలు భారీగా ఉన్నా ఎందుకో వర్క్ అవుట్ కాలేదు.సినిమా నాగ్ కెరియర్ లో మరో డిజాస్టర్ గా నిలిచింది.
ఇక ప్రస్తుతం బిగ్ బాస్ 6 ని హోస్ట్ చేస్తున్న నాగార్జున తన నెక్స్ట్ సినిమా ఏం చేస్తున్నాడు అన్నది క్లారిటీ రాలేదు.
అక్కినేని ఫ్యాన్స్ మాత్రం నాగార్జున హిట్టు సినిమా కోసం ఎదురుచూస్తున్నాడు.
నాగార్జున ఇంతకీ ఎవరి డైరక్షన్ లో మూవీ ప్లాన్ చేస్తున్నాడు.కథా చర్చలు నడుస్తున్నాయా లేదా అసలు ఎందుకు నాగ్ తన నెక్స్ట్ సినిమా కోసం ఇంత లేట్ చేస్తున్నాడు అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
ఏది ఏమైనా నాగార్జున మాత్రం ఈసారి సూపర్ హిట్ కథతో రావాలని ఫిక్స్ అయ్యాడు.అందుకే నాగ్ కొద్దిగా టైం తీసుకుంటున్నారని తెలుస్తుంది.
నాగార్జున ఇప్పటికే రెండు మూడు కథలు విని ఫైనల్ చేశాడట.వారిలో ఎవరికి ఓకే చెబుతారన్నది తెలియాల్సి ఉంది.