విలన్స్ పాత్రలకు మార్క్స్,లెనిన్ పేర్లు పెట్టడం సరికాదు: మట్టిపెళ్లి సైదులు

సూర్యాపేట జిల్లా:గుంటూరు కారం సినిమాలో విలన్స్ పాత్రలకు మార్క్స్,లెనిన్ పేర్లు పెట్టడం సమంజసం కాదని,వెంటనే ఆ పేర్లను తొలగించాలని,లేనియెడల రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని సిపిఎం సూర్యాపేట జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మట్టిపెళ్ళి సైదులు హెచ్చరించారు.

గురువారం సూర్యాపేట జిల్లా మోతె మండల కేంద్రంలో నిర్వహించిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచ మేధావి అయిన కార్ల్ మార్క్స్ మొత్తం ప్రపంచంలోనే దోపిడి వ్యవస్థ పోవాలని,కార్మిక వర్గ రాజ్యం రావాలని, సమసమాజ స్థాపన కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడని,ప్రపంచ అత్యున్నత మేధావిగా ఉన్న ఆయనను ఈ మధ్యకాలంలో దర్శకుడు త్రివిక్రమ్ మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమాలో విలన్ గా నటించిన జగపతిబాబుకు ఆయన పేరు పెట్టడం దుర్మార్గమైన చర్యని అన్నారు.

వెంటనే సినిమాలో విలన్ కు పెట్టిన మార్క్స్ పేరును తొలగించాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి ములుకూరి గోపాల్ రెడ్డి, కమిటీ సభ్యులు గుంటగాని ఏసు,కక్కిరేణి సత్యనారాయణ, గుగులోతు కృష్ణ,చర్లపల్లి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

It Is Not Appropriate To Name The Characters Of Marx And Lenin As Villains Matt

Latest Suryapet News