అనంతగిరి మండల అభివృద్ధి ఇదేనా...?: అంజి యాదవ్

సూర్యాపేట జిల్లా : మనఊరు మనవాడ గడపగడపకు మన అంజన్న కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ అంజి యాదవ్ శనివారంఅనంతగిరి( Ananthagiri manda ) మండలంలోని ,కొత్తగూడెం,గొండ్రియాల,లక్కారం,శాంతినగర్, మొగలాయికోట,కిష్టాపురం గ్రామాలలో పర్యటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార బీఆర్ఎస్ ప్రభు( BRS PARTY )త్వ హయాంలో అనంతగిరి మండలంలో జరిగిన అభివృద్ధి శూన్యమన్నారు.

మండల ప్రజలకు సంక్షేమ పథకాలు అందని ద్రాక్షగా మారాయని,పెన్షన్ల కొరత ఉందని,డబుల్ బెడ్రూమ్ ఇళ్లు లేవని,చదువుకున్న యువతకు నిరుద్యోగ భృతి లేక కూలి పనులు చేస్తున్నారని,కిష్టాపురం పక్కనే పాలేరు వాగున్నా మంచి నీళ్ల తిప్పలు తప్పలేదని,మిషన్ భగీరథ ట్యాంకులు లేవని, శిధిలావస్థలో ఉన్న పాత ట్యాంక్ లకే రంగులేశారని, పాలేరు వాగుపై రైతులకు ఆసరాగా చెక్ డ్యాంలు నిర్మిస్తే కోట్లల్లో స్వాహా చేశారని ఆరోపించారు.అభివృద్ధి పనులు ఎక్కడ జరగలేదని,ప్రజాసమస్యల గోడు వినే నాథుడే లేడని,అందుకే కోదాడ నియోజక వర్గం( Kodada Constituen )లోని అన్ని మండలాలను ఈనెల 14 నుండి ఆగస్టు 27 వరకు పర్యటించి,ప్రజా సమస్యలు తెలుసుకొని రాబోయే కాలంలో వాటి పరిష్కారం కోసం నిరంతరం కొట్లాడుతానని తెలిపారు.

Is This The Development Of Anantgiri Mandal?: Anji Yadav-అనంతగిర�

Latest Suryapet News