ప్రపంచం ఎలా అనుకున్నా పర్లేదు, మాకు నచ్చినట్టు మేము ఉంటాము అనే ధోరణి లో బ్రతికే కుటుంబం మంచు మోహన్ బాబు( Mohan babu ) కుటుంబం.మనసులో ఎలాంటి కల్ముషం పెట్టుకోకుండా,ముక్కు సూటి తనం తో మాట్లాడే స్వభావం ఉన్న వాడు మోహన్ బాబు.
ఆయనతో పాటే ఆయన పిల్లలకు కూడా ఈ స్వభావం ని అలవాటు పర్చాడు.కొన్ని సార్లు అలా మాట్లాడడం వల్ల సోషల్ మీడియా( Social media ) లో విపరీతమైన ట్రోల్ల్స్ ని కూడా ఎదురుకోవాల్సి వచ్చింది, కానీ మోహన్ బాబు కుటుంబం మాత్రం ఎక్కడ ట్రోల్ల్స్ కి గురి అవుతామో అని భయం లేకుండా, ఎలా అయితే ఉండాలని అనుకున్నారో అలాగే ఉంటున్నారు.
ఇక ఈ కుటుంబం లో అందరికంటే మంచు మనోజ్( Manchu Manoj ) కి మంచి క్రేజ్ ఉంది.ఆయన మాట్లాడే మాటలు , ఆయన సినిమాలతో పాటుగా సమాజం పట్ల ఆయనకీ ఉన్న మక్కువ వంటి లక్షణాలు ఆడియన్స్ కి ఆయనని దగ్గర చేసాయి.
ఇక మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి( Manchu lakshmi ) మీద మాత్రం సోషల్ మీడియా లో ట్రోల్ల్స్ ఒక రేంజ్ లో వస్తుంటాయి.ఈమె మాట్లాడే అమెరికన్ ఇంగ్లీష్ యాస ని ప్రతీ ఒక్కరు వెక్కిరిస్తూ ఉంటారు.తెలుగు అమ్మాయి అయ్యుండి కూడా, తెలుగు బాషా రానట్టుగా ఆమె మాట్లాడడం వల్లే ఇలాంటి ట్రోల్ల్స్ వస్తుంటాయి.ఇది ఇలా ఉండగా మంచు లక్ష్మి యాండీ శ్రీనివాసన్ అనే అతనిని పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.
మంచు లక్ష్మి ఎక్కడికి వెళ్లినా ఒంటరి గానే వెళ్తుంది, ఆమె భర్త తో కలిసి ఉండడం లేదా, ఈమె కూడా మిగిలిన టాలీవుడ్ సెలెబ్రిటీలు లాగానే విడాకులు తీసుకుందా.? ఇలాంటి సందేహాలు ఎన్నో నెటిజెన్స్ లో మొదలయ్యాయి.ఇదే విషయాన్నీ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న మంచు లక్ష్మి ని అడగగా ఆమె ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
ఆమె మాట్లాడుతూ ‘సోషల్ మీడియా లో వచ్చే వార్తలను నేను కూడా గమనిస్తూనే ఉంటాను, ఈ వార్త కూడా నా దృష్టికి వచ్చింది.మా ఆయన అమెరికా లో సాఫ్ట్ వేర్ ఉద్యోగి, అక్కడ ఆయన చాలా సంవత్సరాల నుండి పని చేస్తున్నాడు.నేను ఒకసారి లాస్ ఏంజిల్స్ కి వెళ్ళినప్పుడు నా చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు, చదువుకునే రోజుల్లో నేను ఉద్యోగాలు చేసి డబ్బులు సంపాదించేదానిని, కానీ నేను లాస్ ఏంజిల్స్ లోనే ఉండడం వల్ల నాకు సంపాదన ఉండేది కాదు, ఇదే విషయాన్నీ ఆయనతో చెప్తే, నీకు ఏది అనిపిస్తే అది చెయ్యి, నీ వృత్తి సినిమా కాబట్టి నీకు అది అత్యవసరం.
నువ్వు సంతోషం గా ఇండియా కి వెళ్లి సినిమాలు చేసుకోవచ్చు, ఖాళీ సమయం లో ఇక్కడికి రా అని చెప్పాడు.మా ఇద్దరి మధ్య అంత ఫ్రీడమ్ ఉంటుంది’ అని చెప్పుకొచ్చింది మంచు లక్ష్మి.