కాంగ్రెస్ పిలుపు మేరకే కాంగ్రెస్ పార్టీలో చేరామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.తన కుమార్తె కడియం కావ్యతో కలిసి సమావేశం నిర్వహించిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
నియోజకవర్గ ప్రజల మంచి కోసం ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీలో చేరామని తెలిపారు.ఈ క్రమంలో కాంగ్రెస్ తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయబోమని చెప్పారు.
పదేళ్లుగా కేంద్రంలో మోదీ ప్రభుత్వం వ్యవస్థలను నాశనం చేసిందన్న కడియం శ్రీహరి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా పాలన సాగుతోందని విమర్శించారు.
సీబీఐ, ఈడీ కేసులతో బెదిరించి లొంగదీసుకుంటున్నారని చెప్పారు.బీజేపీ( BJP )లో చేరితే పునీతులవుతున్నారన్న ఆయన ప్రతిపక్షంలో ఉంటే వారిని వేధిస్తున్నారని ధ్వజమెత్తారు.రానున్న ఎన్నికల్లో 400 సీట్లలో బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని పేర్కొన్నారు.
రిజర్వేషన్లు ఎత్తేస్తారన్నారు.బీజేపీ అప్రజాస్వామిక విధానాలను అడ్డుకునే శక్తి కాంగ్రెస్ కు మాత్రమే ఉందన్న కడియం శ్రీహరి ప్రాంతీయ పార్టీలు బీజేపీని ఎదుర్కోలేవని తెలిపారు.