కౌంటింగ్ లైవ్ కెమెరాల ఏర్పాటు 26 నాటికి పూర్తి చేయాలి: కలెక్టర్

సూర్యాపేట జిల్లా: కౌంటింగ్ రోజున స్థానిక వ్యవసాయ మార్కెట్ నందు నియోజక వర్గాలకు కేటాయించిన కౌంటింగ్ హాల్ లోపల, బయట అలాగే స్టాంగ్ రూమ్స్ బయట లైవ్ కెమెరాలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్,జిల్లా ఎన్నికల అధికారి ఎస్.

వెంకట్రావ్ ఆదేశించారు.

స్థానిక వ్యవసాయ మార్కెట్ నందు డిసెంబర్ 3 న జిల్లాలోని నాలుగు నియోజక వర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు నేపథ్యంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ నిర్దేశించిన చోట లైవ్ కెమెరాలు ఈ నెల 26 తేదీ నాటికి పూర్తి చేయాలని వచ్చే ప్రజా ప్రతినిధులు,పోలింగ్ ఏజెంట్లకు ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా లైవ్ కెమెరాలు అందుబాటులో ఉంచాలని సూచించారు.

Installation Of Counting Live Cameras Should Be Completed By 26 Collector S Venk

నాలుగు కౌంటింగ్ హాల్స్ లో లోపల, బయట లైవ్ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.కౌంటింగ్ రోజున హాల్ లో 14 టేబుల్స్,ఆర్ఓ టేబుల్ అలాగే ఏర్పాటు చేసే గ్యాలరీలో నాలుగు లైవ్ కెమెరాలు ఏర్పాటు చేయాలని అన్నారు.

అదే విధంగా నిర్దేశించిన రూట్ నందు,అన్ని స్ట్రాంగ్ రూమ్స్ వద్ద బయట లైవ్ కెమెరాలు అమార్చాలని సూచించారు.ఈ సమావేశంలో డి.ఎం.గఫ్ఫార్,ఎలక్షన్ సెల్.డి.టి.వేణు, ఎస్ఆర్ఎం ఏజెన్సీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
కూరగాయల కొనుగోలులో సామాన్యుడికి తప్పని తిప్పలు

Latest Suryapet News