ఓటమి నుండి స్పూర్తి పొందడమే అసలైన గెలుపు:మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా:ఓటమి నుండి స్పూర్తి పొందడమే అసలైన గెలుపు అని సూర్యాపేట రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.

శుక్రవారం జిల్లా కేంద్రంలోని రవి మహల్ ఫంక్షన్ హాల్లో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఆదివారం జరుగనున్న కానిస్టేబుల్ రాత పరీక్షకు హాజరు కానున్న అభ్యర్థులకు ప్రేరణ (మోటివేషన్) కార్యక్రమానికి ఆయన ముఖ్యాతిథిగా హాజరై అభ్యర్ధులకు తన అనుభవాలతో ప్రేరణ కల్పించారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ యువత నిరంతరం ఆశావాహులై ఉండాలని, ఆలోచనలలో పేదరికాన్ని దరి చేరనీయవద్దన్నారు.ఆలోచనలు గొప్పగా ఉంటేనే జీవితంలో ఎత్తుకు ఎదగవచ్చని,పనిచేసే లక్షణమే యువతకు గొప్ప అవకాశం కావాలన్నారు.

Inspiration From Defeat Is The Real Victory: Minister Jagdish Reddy , Minister J

ఏ పని చేయకుండా ఉంటే జీవితంలోకి దారిద్ర్యంను ఆహ్వానించినట్లేనన్నారు.దురదృష్టవశాత్తు చదువు అంటే ఉద్యోగం మాత్రమే అనే భావన సమాజాన్ని పట్టి పీడిస్తుందని,ఆ భావనను యువత విడనాడాలని, ప్రస్తుత పోటీ ప్రపంచంలో సాధించాలనే తపనతో పాటు,యువత క్రీడా స్పూర్తిని అలవర్చుకోని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు.

ప్రస్తుత సమాజంలో పెద్ద పెద్ద బిజినెస్ మెన్ లు, పారిశ్రామిక వేత్తలు కూడా ఒకప్పుడు కూలీలేనని గుర్తు చేశారు.ఒకప్పుడు తెలంగాణ వలసల తెలంగాణ అనే పేరు పొందిన మన రాష్టానికి దేశ వ్యాప్తంగా 30 లక్షల మంది ఇతర రాష్ట్రాల ప్రజలు ఉపాధి కోసం వస్తున్నారని తెలిపారు.

Advertisement

యువత ఉపాధికి కొలమానం పరిశ్రమల ఏర్పాటేనని అన్నారు.ఆదివారం జరుగబోయే కానిస్టేబుల్ పరీక్షలో సూర్యాపేట నుండి హాజరయ్యే 193 మంది యువతీ,యువకులు మెరిట్ సాధించాలని, ఉద్యోగం సాధించే వారికి ముందస్తు అభినందనలు తెలిపారు.

రాని వారు కూడా జీవితంలో ఇంతకన్నా మెరుగైన పద్దతిలో ఉండటానికి లభించిన అవకాశంగా భావించాలని కోరారు.కానిస్టేబుల్ పరీక్షలకు వెళుతున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ఏడాది కాలంగా విద్యార్థినీ,విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన అధ్యాపకులను, పోలీసులను సత్కరించారు.

అనంతరం కానిస్టేబుల్ అభ్యర్థులతో కలిసి వారి తో మాటా మంతీ నిర్వహిస్తూ నిలబడి వాటిలో ఒకడిగా కలిసిపోయి భోజనం చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్పీ రాజేంద్రప్రసాద్, అడిషనల్ కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్,సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ రాములు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

కానిస్టేబుల్ రాంబాబు మృతి బాధాకరం : ఎస్పీ నరసింహ
Advertisement

Latest Suryapet News