కాంటాలలో ఎలాంటి సమస్యలు వచ్చినా తెలియపరచాలి

సూర్యాపేట జిల్లా: ధాన్యం కొనుగోలు కేంద్రాలలోని కాంటాలలో ఎలాంటి సమస్యలు వచ్చినా వెంటనే తెలియపరచాలని తూనికలు కొలతల జిల్లా అధికారి వెంకటేశ్వర్లు అన్నారు.

గురువారం మండల కేంద్రంలోని పిఏసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రంలోని కాంటాలను తనిఖీ చేసి స్టాంపింగ్ చేసి ధ్రువీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని కాంటాలలో ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని, రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని కొనుగోలు కేంద్రాల నిర్వహకులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ సీఈవో జూలకంటి శ్యాంసుందర్ రెడ్డి, సిబ్బంది ఎల్క కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Inform If There Is Any Issue In Weighing Machines, Weighing Machines, Crop Purc

Latest Suryapet News