ఊరు కదలాలే.. జనం తరలాలే

సూర్యాపేట జిల్లా: ఊరు కదలాలే జనం తరలాలే విశ్వ ఖ్యాతిని చాటేలా విశ్వరూపం మహాసభకు దండు కదలాలని మాదిగ జర్నలిస్ట్స్ ఫోరం జాతీయ అధ్యక్షులు దాస్ మాతంగి అన్నారు.గురువారం సూర్యాపేట జిల్లా కోదాడలోని ఎంఎస్ కళాశాలలో జరిగిన మాదిగ జర్నలిస్ట్స్ ఫోరం అత్యవసర సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.జర్నలిస్టుల సంక్షేమానికి తోడు జాతి ఔన్నత్యం చాటేలా వర్గీకరణ ఉద్యమానికి అండగా నిలువాలన్నారు.వర్గీక”రణం” చివరి అంఖానికి చేరుకుందని, ఇక చావో రేవో అన్న తరహాలో సాగుతున్న సంగ్రామంలో జాతి ప్రజలంతా విశ్వరూప మహాసభకు హాజరై విజయవంతం చేయాలన్నారు.

 Madiga Journalists Forum Vishwaroopam Mahasabha, Madiga Journalists Forum ,vishw-TeluguStop.com

ఈనెల 11న విశ్వ ఖ్యాతిని చాటేలా విశ్వరూప మహాసభ జరుగుతుందని, ఈ సభకు ముఖ్య అతిథిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కానున్నట్లు చెప్పారు.ఉద్యమాల వీరుడు, అలుపెరుగని పోరాట పటిమతో వర్గీకరణ లక్ష్యమే ఊపిరిగా భావించిన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ సారథ్యంలో సాగే సంగ్రామం కీలక దశకు చేరుకుందన్నారు.

ఎస్సీ వర్గీకరణకు ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే చట్టబద్ధ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 11న హైదరాబాదులో జరిగే మాదిగల విశ్వరూప మహాసభను జయప్రదం చేయాలని కోరారు.

మాదిగలతో పాటు ఉప కులాలకు మేలు చేసే లక్ష్యంతో 28 సంవత్సరాల ఆకాంక్ష అయిన ఎస్సీ వర్గీకరణ ఉద్యమం అంతిమ దశకు చేరుకుందన్నారు.

ఎస్సీ వర్గీకరణ సాధనకై ఈనెల 11న హైదరాబాదులో జరిగే మాదిగల విశ్వరూప మహాసభకు కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గల నుండి పెద్ద ఎత్తున మాదిగ, మాదిగ ఉప కులాల జర్నలిస్టులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మొలుగురి గోపి,రాష్ట్ర కార్యదర్శి పిడమర్తి గాంధీ,పడిశాల రఘు,రవీందర్,విశాఖ, రాకేష్,శేఖర్,సునీల్, నాగేందర్,అంజి,శివకృష్ణ, గోపి,బుచ్చిరాములు, ఉపేందర్,సందీప్,శ్యామ్, బాలాజీ తదితరుల పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube