జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నిరవధిక సమ్మె

సూర్యాపేట జిల్లా:జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయాలనే ప్రధాన డిమాండ్ తో సమ్మె బాట పట్టిన జూనియర్ పంచాయితీ కార్యదర్శులు శుక్రవారం గరిడేపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం ముందు శాంతియుత నిరవధిక సమ్మెకు దిగారు.

ఈ సందర్భంగా పలువురు కార్యదర్శులు మాట్లడుతూ రాష్ట్ర ప్రభుత్వం తాము పనిచేసిన నాలుగు సంవత్సరాల ప్రొబేషనరీ కాలాన్ని సర్వీస్ కాలంగా పరిగణించాలని,అవుట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులకు వెంటనే జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా గుర్తించి క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు.

గ్రామాలు అభివృద్ధి చెందడంలో ప్రధాన పాత్ర పోషించినందుకు మమ్మల్ని రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నామని కోరారు.

Bet365 бонусная программа: разбор механик, ограничений и реальной ценности

Latest Suryapet News