రాహుల్ గాంధీ ఏ హోదాలో మాట్లాడిండు:జగదీష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా:వరంగల్ లో జరిగిన కాంగ్రేస్ రైతు సంఘర్షణ సభపై రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.

కాంగ్రెస్ హామీలు నీటి మూటలేనని,దారినపోయే దానయ్యలు మాట్లాడితే నమ్మడానికి తెలంగాణ ప్రజలు అమాయకులు కారని,రాసిచ్చిన చిలుక పలుకులు తప్ప రాహుల్ గాంధీ మాటల్లో పసలేదు కొట్టిపారేశారు.

వరంగల్ లో రాహుల్ గాంధీ ఏఐసిసి ప్రతినిధిగానా లేక పిసిసి ప్రతినిధిగా మాట్లాడిండా అని ఎద్దేవా చేశారు.వరంగల్ డిక్లరేషన్ ఏఐసిసిదా లేక పిసిసిదా ముందు డిక్లేర్ చేయాలన్నారు.

In What Capacity Did Rahul Gandhi Speak: Jagdish Reddy-రాహుల్ గా

దేశానికి మొత్తం కాంగ్రెస్ పార్టీ ఇదే విధానాన్ని అవలంబిస్తుందా?కాంగ్రెస్ పార్టీకి జాతీయ విధానం అంటూ ఒకటి ఉందా?పూటకో మాదిరిగా ఊరికో మాదిరిగా మాట్లాడతారా? ఏఐసిసి,పిసిసిలు తయారు చేసినది డిక్లరేషన్ కాదని అన్నారు.డిక్లరేషన్ ఇచ్చే అర్హత రాహుల్ గాంధీకి లేదని,ఉన్న తెలంగాణాను ఊడగొట్టి ఆంధ్రలో కలిపిందే కాంగ్రెస్ అని,60 సంవత్సరాలుగా తెలంగాణా ప్రజల ఉసురు తీసిందే కాంగ్రేస్ అని,తెలంగాణాను ఆంధ్రలో కలిపేనాటికి కుదిరిన పెద్దమనుషుల ఒప్పందంలో అక్షరం ముక్క అమలుకు నోచుకోలేదని,గిర్ గిలానీ కమిటీ,ఫజల్ అలీ కమిషన్,6 పాయింట్ ఫార్ములా,610 జిఓలు అమలుకు నోచుకోలేదని గుర్తు చేశారు.

ఆరు దశాబ్దాల కాలంలో ఏ ఒక్కటి అమలు కాలేదని,తెలంగాణా ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి అమలు అయిన చరిత్ర లేదని,వరంగల్ సభతో తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమి లేదని డిక్లేర్ చేశారు.ఏఐసిసి నాయకుడు వస్తాడు,ఎదో చేస్తాడన్న భ్రమలు తెలంగాణా ప్రజలకు ఏమి లేవని,8 ఏండ్లుగా ఈ రాష్ట్ర నాయకులు ఏమి మాట్లాడుతున్నారో అదే తప్ప కొత్తగా ఢిల్లీ నుండి వచ్చిన మాట ఒక్కటి కూడా లేదని,వరంగల్ సభలో రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు రాసిచ్చిన చిలుక పలుకులు అన్నారు.2018 ఎన్నికల్లో కుడా ఇవే హామీలు ఇచ్చారని,తెలంగాణా ప్రజలు ఆనాడు నమ్మలేదు,ఈ రోజు నమ్మరు,రేపు నమ్మబోరని స్పష్టం చేశారు.

Advertisement

Latest Suryapet News