కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారు:ఉత్తమ్

సూర్యాపేట జిల్లా:బీసీ నాయకుడు, మాజీ సర్పంచ్ సంపెట రవి గౌడ్‌పై కోదాడ పోలీసులు తప్పుడు కేసులు పెట్టి సూర్యాపేట జైలుకు పంపించారని నల్లగొండ ఎంపీ కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

సోమవారం సూర్యాపేట సబ్ జైలును సందర్శించి రవి గౌడ్‌ను పరామర్శించారు.

జైలులో ఉన్న అండర్ ట్రయల్ ఖైదీలందరితో మాట్లాడి,జైలు పరిస్థితులను అడిగి తెలుసుకుని,పండ్లు, ఆహార పదార్థాలను పంపిణీ చేశారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సంపెట రవి గౌడ్ కు న్యాయ సహాయంతో పాటు,అతని కుటుంబ సభ్యులను సంపూర్ణంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

తెలంగాణ పోలీసులను ఉపయోగించి కాంగ్రెస్ శ్రేణులను ఇబ్బందులు పెడుతున్న కేసీఆర్,మోదీ సీబీఐ,ఈడీ, ఐటీలను దుర్వినియోగం చేస్తున్నారని ఎందుకు గొంతు చించుకుంటున్నారని ప్రశ్నించారు.మీరు చేస్తే సంసారం మరొకరు చేస్తే వ్యభిచారమా అని నిలదీశారు.

ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement
జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సన్ ప్రీత్ సింగ్...!

Latest Suryapet News