అకాల వర్షంతో చెరువును తలపిస్తున్న ఐకెపి కేంద్రం...!

సూర్యాపేట జిల్లా: మునగాల మండలంలోని రేపాల గ్రామంలో బుధవారం మధ్యాహ్నం కురిసిన అకాల వర్షానికి ఐకెపి సెంటర్లోని రైతుల ధాన్యం రాశులు పూర్తిగా నీటి మునిగిపోయాయి.

దీనితో వర్షంలోనే అన్నదాతలు ఐకెపి కేంద్రంలోని నీటికి బయటికి తరలించేందుకు శ్రమించాల్సి వచ్చింది.

ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లడుతూ ఆరుగాళ్ళం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చిన తరుణంలో అకాల వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయని వాపోయారు.ఐకెపి సెంటర్లో కొనుగోలు ప్రక్రియ నత్తనడకన సాగడంతోనే ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

IKP Center Facing Pond Due To Untimely Rain , Untimely Rain, IKP Center-అక�

ఇప్పటికైనా సంబంధిత అధికారులు మేల్కొని తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని, ఎగుమతులు దిగుమతులు వేగవంతం చేయాలని కోరారు.

పింఛన్ల కోసం పొద్దంతా పడిగాపులు...!
Advertisement

Latest Suryapet News