వారంలో ఒక్కసారి ఈ హెయిర్ సీరంను వాడితే ఊహించని లాభాలెన్నో మీ సొంతం!

నల్లటి దట్టమైన జుట్టును ఎవరు కోరుకోరు చెప్పండి.స్త్రీలు అయినా పురుషులు అయినా అలాంటి జుట్టు కోసమే ఆరాటపడుతుంటారు.

కానీ జీవన శైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు, జుట్టు సంరక్షణ లేకపోవడం వంటి అంశాలు హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ తదితర సమస్యలకు కారణాలుగా మారుతుంటాయి.అయితే ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ హెయిర్ సీరంను కనుక వాడితే ఊహించని ఎన్నో లాభాలు మీ సొంతం చేసుకోవచ్చు.

ఈ సీరం హెయిర్ ఫాల్ మొద‌లు ఎన్నో సమస్యలకు చెక్ పెడుతుంది.అలాగే మరిన్ని ప్రయోజనాలను అందిస్తుంది.

మరి ఇంతకీ ఆ హెయిర్ సీరం ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక మీడియం సైజు బీట్ రూట్ ను తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

Advertisement
If You Use This Hair Serum Once A Week You Will Have Many Unexpected Benefits De

ఆ తర్వాత మిక్సీ జార్ లో తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న బీట్ రూట్ ముక్కలు, రెండు లేదా మూడు మందారం పూలు, ఒక కప్పు రోజ్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి పల్చటి వస్త్రం సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

If You Use This Hair Serum Once A Week You Will Have Many Unexpected Benefits De

ఈ జ్యూస్ లో రెండు టేబుల్ స్పూన్లు ఆపిల్ సైడర్ వెనిగర్, ఆరు చుక్కలు నీమ్ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మన హెయిర్ సీరం సిద్దమవుతుంది.ఈ హెయిర్ సీరం ను నైట్ నిద్రించే ముందు జుట్టు కుదుళ్లకు బాగా అప్లై చేసి మసాజ్ చేసుకోవాలి.మనసటి రోజు ఉదయాన్నే మైల్డ్‌ షాంపూ ని యూస్ చేసి హెయిర్ వాష్ చేసుకోవాలి.

వారంలో ఒక్కసారి ఇలా చేస్తే జుట్టు రాలడం, చిట్లడం తగ్గుతుంది.తెల్ల జుట్టు సమస్య త్వ‌ర‌గా దరిచేరకుండా ఉంటుంది.

చుండ్రు సమస్య దూరం అవుతుంది.కురులు నల్లగా మరియు దట్టంగా పెరుగుతాయి.

శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?

జుట్టు సూపర్ షైనీ గా సైతం మారుతుంది.

Advertisement

తాజా వార్తలు