అమెరికా భారతీయులకు వీసా కష్టాలు.. ఇంకా ఇన్నిరోజులు టైం ఉందా..

ఆర్థిక సంక్షోభం, ఉద్యోగాల కొరత కారణంగా చాలామంది భారతీయులు అమెరికాకు వలస వెళ్తున్నారు.హెచ్ వన్ బి వీసా ఉన్నవాళ్లు ఉద్యోగాలు కోల్పోతే రెండు నెలల్లో తిరిగి ఉద్యోగం సంపాదించాలి.

 Visa Problems To Indian Americans Due To Inflation Details, Visa Problems ,india-TeluguStop.com

లేకుంటే మాత్రం వాళ్ళ వీసా స్టేటస్ మారిపోయే అవకాశం ఉంది.అమెరికా చట్టాల ప్రకారం హెచ్ వన్ బి వీసా కింద ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆ ఉద్యోగం కోల్పోతే మాత్రం తిరిగి రెండు నెలల్లో మరో కొత్త విద్య ఉద్యోగం సంపాదించాల్సిందే.

లేదంటే స్టేటస్ మారిపోయే అవకాశం ఉంది.

కరోనా ప్రభావం, అధిక ధరల ప్రభావం, వడ్డీరేట్ల పెంపు కారణంగా ఆర్థికంగా నష్టపోతున్న అమెరికా లో చాలా టేక్ కంపెనీల ఉద్యోగులను తొలగిస్తున్నారు.

ఇప్పటివరకు దాదాపు లక్ష యాభై వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు.గత నవంబర్ లోనే దాదాపు 51 వేల మంది భారతీయులు ఉద్యోగాలు కోల్పోయినట్లు సమాచారం.అంతే కాకుండా ఇతర కంపెనీల నుండి కూడా ఉద్యోగాలకు కోత పెడుతున్నట్లు సమాచారం.హెచ్ వన్ బి వీసా ఉన్న వారు 60 రోజుల్లో ఉద్యోగాలు సంపాదించకుంటే వీసా స్టేటస్ మారిపోయే అవకాశం ఉంది.

వాస్తవానికి చాలా కంపెనీలు ఎంతమంది ఉద్యోగులను తొలగించారు అన్న వివరాలను ఇంకా వెల్లడించలేదు.

అంతేకాకుండా కొత్త ఉద్యోగాలపై ఆంక్షలు కూడా విధిస్తున్నారు.దీనివల్ల హెచ్ వన్ బి వీసా ఉండి ఉద్యోగాలు కోల్పోయిన భారతీయుల పరిస్థితి ఎంతో దారుణంగా మారిపోయింది.ప్రస్తుత పరిస్థితుల్లో టెక్ కంపెనీలో ఉద్యోగాలు కోల్పోయిన వాళ్లకు రెండు నెలల్లో కొత్త ఉద్యోగాలు లభించడం చాలా కష్టమని అక్కడివారు చెబుతున్నారు.

అమెరికాలో ప్రస్తుతం ఐదు లక్షల మందికి హెచ్ వన్ బి విసాలు ఉన్నాయి.వాళ్లలో ఎక్కువ మంది ఇండియా, చైనా నుంచి వచ్చినవారే.కొత్తగా అమెరికా ప్రభుత్వం జారీ చేసిన 85 వేల హెచ్1బి విసాల కోసం ఐదు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube