మార్కెట్ కి వెళితే అసభ్యంగా తాకారు... నటి సంచలన వ్యాఖ్యలు!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రెటీలు ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకొని ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీగా కొనసాగుతూ ఉన్నవారు బయటికి వెళ్లడానికి పెద్దగా ఇష్టపడరు.

ముఖ్యంగా హీరోయిన్లు కనుక బయట ఎక్కడైనా కనపడితే పెద్ద ఎత్తున అభిమానులు చుట్టుముట్టి వారు హీరోయిన్ పట్ల కాస్త అభ్యంతరకరంగా వ్యవహరిస్తూ ఉంటారు.

ఇలా ఎంతో మంది హీరోయిన్లు షాపింగ్ మాల్స్(Shoping Maals) ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు లేదా ఇతర పనుల నిమిత్తం బయటకు వచ్చినప్పుడు ఈ విధమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్న వారు చాలామంది ఉన్నారు.అయితే తాజాగా నటి షేఫాలీ షా(Shefali shah ) కూడా ఈ విధమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నానని తెలియజేశారు.

నటి షేఫాలీ షా 1995 లో వచ్చిన రంగీలా సినిమా ద్వారా వెండితెరకు నటిగా పరిచయం అయ్యారు.ఈ సినిమా తర్వాత సత్య సినిమాలో నటించగా ఈమెకు ఏకంగా ఫిలింఫేర్ అవార్డు కూడా లభించింది.ఇటీవల జల్సా డార్లింగ్ డాక్టర్ జి వంటి సినిమాలలో కూడా నటించి మెప్పించారు.

మరోవైపు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ ఈమె ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇలా సినిమాలు వెబ్ సిరీస్ లో బుల్లితెర సీరియల్స్ ద్వారా ఎంతో బిజీగా గడుపుతున్న ఈమె తాజాగా ఏఎన్ ఐ పాడ్ క్యాస్ట్ లో పాల్గొన్నారు.

Advertisement

ఈ కార్యక్రమంలో భాగంగా తనకు జరిగినటువంటి చేదు సంఘటన గురించి బయటపెట్టారు.

ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ ఓసారి తను భారీగా రద్దీగా ఉన్నటువంటి మార్కెట్ కి(Market) వెళ్లాలని తెలిపారు.అయితే అక్కడ తనని ఎవరో అసభ్యకరంగా తాకారని ఆ క్షణం తనకు చాలా కంపరంగా అనిపించిందని తెలియజేశారు.ఈ విషయంలో తాను గిల్టీగా ఫీల్ అవడం లేదు కానీ ఇది మాత్రం చాలా సిగ్గుచేటుగా అనిపించిందని నటి షేఫాలీ షా తెలియజేశారు.

అయితే నా పట్ల అలా ప్రవర్తించడంతో నేను వారిని ఏమీ అనకుండా వదిలేసాను.ఆ సమయంలో తామే ఏదో తప్పు చేసినట్టుగా ఫీల్ అయ్యి మర్చిపోతాము.

అయితే ఇలాంటి ధోరణికి మనం చెక్ పెట్టాలి అని,దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ ఈ సందర్భంగా ఈమె తనకు జరిగినటువంటి ఈ చేదు సంఘటన గురించి ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు