ఐఏఎస్ స్మిత సభర్వాల్ ను అనర్హురాలిగా ప్రకటించాలి

సూర్యాపేట జిల్లా: వికలాంగులను కించపరిచిన ఐఏఎస్ స్మిత సభర్వాల్ ను అనర్హురాలిగా ప్రకటించాలని,తక్షణమే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్ పి ఆర్ డి )జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు అరవపల్లి లింగయ్య, వీరబోయిన వెంకన్న డిమాండ్ చేశారు.

మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ సెంటర్ లో నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా పని చేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి స్మిత సభర్వాల్ వికలాంగులను కించపరిచే విధంగా జులై 21నాడు ట్విట్టర్ లో పోస్ట్ పెట్టినారన్నారు.ఆమె పెట్టిన పోస్ట్ ఐక్యరాజ్య సమితి హక్కుల ఒప్పంద పత్రం మరియు 2016 RPWD చట్టంలో పేర్కొన్న సమానత్వం మరియు వికలాంగుల పట్ల వివక్షతకు పూర్తి భిన్నమైందని పేర్కొన్నారు.

IAS Smita Sabharwal Should Be Declared Disqualified , Shiramshetty Rama Rao, Ram

వికలాంగులను కించపరిచే ఉద్దేశంతో బహిరంగంగా ఉద్దేశపూర్వకంగా అవమానించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.వికలాంగులను అగౌరవపరిచెందుకు ప్రయత్నం చేశారు.2016 RPWD చట్టం సెక్షన్ 34 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల్లో వికలాంగుల కొరకు ప్రత్యేకంగా వైకాల్యాన్ని బట్టి రిజర్వ్ పోస్టులు గుర్తించి ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ అమలు చేయాలని స్పష్టంగా ఉన్న విషయం ఆమెకు తెలియదని ప్రశ్నించారు.2016 RPWD చట్టం సెక్షన్ 92(A),(B),(E) ల ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.సమాజంలో వికలాంగులకు ఉన్న అవకాశాలను తగ్గించే విదంగా మాట్లాడడం సరైంది కాదన్నారు.

ట్రెయిన్లో నుంచి దొంగలు తోసేస్తే ఒక కాలును పోగొట్టుకుని,వెన్నెముక గాయాలకు గురైన అరుణిమా సిన్హా ఎవరెస్ట్ ఎక్కిందని,ఎవరెస్టును అధిరోహించిన ప్రపంచంలోనే తొలి ఫిమేల్ యాంప్యుటీగా ఘనత సాధించింది వికలాంగురాలె కదా అని అన్నారు.యాక్సిడెంట్ లో ఒక కాలును పోగొట్టుకున్న సుధా చంద్రన్ భరత నాట్యంలో మేటిగా నిలిచారాని అన్నారు.

Advertisement

స్పైన్ ట్యూమర్ వల్ల నడుము కింది భాగం కదలికలు కోల్పోయినా పట్టుదలతో పారా ఓలంపిక్స్ లో పాల్గొని దేశానికి మెడల్ తెచ్చి సత్తా చాటిన దీపా మాలిక్ వికలాంగురాలేనని తెలిపారు.స్కోలియోసిస్ సమస్య బారిన పడిన ఇరా సింఘాల్ 2014 సివిల్స్ టాపర్ గా నిలిచినరని అన్నారు.

వీళ్లందరి సమర్థ్యం ముందు సకలాంగులకు ఉన్న సామర్థ్యం ఎంత అని ప్రశ్నించారు.వైకల్యం కలిగిన డాక్టర్స్ మనోభావాలు దెబ్బతినెలా మాట్లాడే హక్కు మీకు ఎవ్వరు ఇచ్చారని ప్రశ్నించారు.

స్మిత సభర్వాల్ వికలాంగులను కించపరిచాననే ఆవేదన లేకుండా తన వ్యాఖ్యలను సమర్తించుకోవడం సిగ్గుచేటన్నారు.స్మిత సబర్వాల్ తన వైఖరి మార్చుకోవాలని లేని యెడల తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా నాయకులు శిరంశెట్టి రామారావు,రమేష్, వెంకట్,నాగేశ్వరరావు, వనిత,చంద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest Suryapet News