గొంతులో తీవ్ర‌మైన మంటా? అయితే ఈ టిప్స్ మీకే!

ఒక్కోసారి గొంతులో తీవ్ర‌మైన మంట పుడుతూ ఉంటుంది.దాంతో ఏమ‌న్నా తినాల‌న్నా, తాగాల‌న్నా చివ‌ర‌కు మాట్లాడాల‌న్నా తెగ ఇబ్బంది ప‌డిపోతూ ఉంటారు.

ఇన్‌ఫెక్షన్‌‌, జలుబు మరియు ఫ్లూ, బ్యాక్టీరియా, స్మోకింగ్, ఏవైనా పుండ్లు ఏర్ప‌డ‌టం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల గొంతులో మంట పుడుతూ ఉంటుంది.ఇక ఈ స‌మ‌స్య‌ను ఎలా నివారించుకోవాలో తెలియ‌క స‌త‌మ‌త‌మ‌య్యే వారు ఎంద‌రో.

అయితే ఇప్పుడు చెప్ప‌బోయే కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే సులువుగా గొంతు మంట‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు.గొంతు మంట‌ను త‌గ్గించ‌డంలో యాపిల్ సిడార్ వెనిగర్ గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.

ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటితో ఒక స్పూన్ యాపిల్ సిడార్ వెనిగర్ వేసి మిక్స్ చేసి సేవించాలి.ఇలా రోజుకు ఒక సారి చేస్తే గొంతు మంట త‌గ్గుముఖం ప‌డుతుంది.

Advertisement
How To Get Relief From Sore Throat! Sore Throat, Latest News, Health Tips, Good

అలాగే స్వ‌చ్ఛ‌మైన తేనెతో కూడా గొంతు మంట‌ను నివారించుకో వ‌చ్చు.ప్ర‌తి రోజు ఉద‌యం, సాయంత్రం ఒక స్పూన్ చొప్పున తేనెను తీసుకోవాలి.

త‌ద్వారా తేనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్‌, యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ గొంతు మంట‌ను మ‌టు మాయం చేస్తాయి.

How To Get Relief From Sore Throat Sore Throat, Latest News, Health Tips, Good

యూకలిప్టస్ ఆయిల్ తో కూడా గొంతు మంట దూరం చేసుకోవ‌చ్చు.గిన్నెలో వేడి నీరు పోసి అందులో కొన్ని చుక్కల యూకలిప్టస్ ఆయిల్ వేసి.కాసేపు ఆవిరి పడుతూ ఉండాలి.

ఇలా చేసినా కూడా గొంతు మంట త‌గ్గుతుంది.పసుపు పాలు తీసుకోవ‌డం ద్వారా కూడా గొంతు మంట‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు.

శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?

ప్ర‌తి రోజు రాత్రి నిద్రించే ముందు ప‌సుపు పాలు తాగితే.అందులో ఉండే యాంటీ ఏజీంగ్ ప్రాపర్టీస్ గొంతు మంట నుంచి ఉప‌శ‌మ‌నాన్ని అందిస్తాయి.

Advertisement

గొంతు మంటను త‌గ్గించే శ‌క్తి నిమ్మ పండుకు కూడా ఉంది.ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మ రసం మిక్స్ చేసి సేవిస్తే మంచి ఫ‌లితం ఉంటుంది.

తాజా వార్తలు