అనుమతులు లేకుండా మట్టి మైనింగ్ ఎలా నడుస్తుంది...?

సూర్యాపేట జిల్లా: జిల్లాలోని చివ్వెంల మండలంలో చెరువుల నుండి ఇటుక బట్టీలకు, వెంచర్లకు రాత్రి పగలు తేడా లేకుండా అక్రమంగా మట్టిని తరలిస్తూ, అడ్డదారిలో అక్రమార్జనకు తెగబడినా సంబంధిత అధికారులు ఎందుకు అడ్డుకట్ట వేయలేక పోతున్నారని మండల ప్రజలు వాపోతున్నారు.

ఈ అక్రమ మట్టి తరలింపు వ్యాపారం చివ్వెంల మండల పరిధిలో ఎక్కువగా జరగడానికి వివిధ శాఖల అధికారులు మట్టి మాఫియాతో కుమ్మక్కై,అక్రమ మట్టి మైనింగ్ కు అనధికార అనుమతులు ఇస్తూ సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అధికారుల అండ లేకుండా బరితెగించి చెరువులను ఎలా ధ్వంసం చేస్తారనే ప్రశ్నలు ప్రజల నుండి వెల్లువెత్తుతున్నాయి.మట్టి అక్రమ రవాణాపై పలువురు విలేకరులు అధికారులకు పలుమార్లు సమాచారం ఇచ్చినా, స్థానికులు ఫిర్యాదులు చేసినా ఉలుకు పలుకు లేకుండా మీనమేషాలు లెక్కిస్తున్న తీరు పలు అనుమానాలకు తావిస్తుందని అంటున్నారు.

యధేచ్ఛగా మట్టిని తవ్వుతూ లక్షల్లో అక్రమార్జన చేస్తున్నా ఇప్పటి వరకు ఏ ఒక్క వాహనాన్ని పట్టుకున్న దాఖలాలు లేకపోవడం,కేసులు పెట్టకపోవడం ఏమిటని ప్రజలు పెదవి విరుస్తున్నారు.ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధకారులు స్పందించి చివ్వెంల మండలంలో జరుగుతున్న విచ్చలవిడి మట్టి మాఫియాపై ఉక్కుపాదం మోపి,అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

కోదాడలో గ్రానైట్ ను తరలిస్తున్న 13 ట్రాలీలు సీజ్
Advertisement

Latest Suryapet News