నకిలీ విత్తనాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలి

యాదాద్రి భువనగిరి జిల్లా:అడ్డగూడూరు మండల రైతులు( Farmers ) నకిలీ విత్తనాలపై అప్రమత్తంగా ఉండాలని, నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి మోసపోవద్దని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్,బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి మందులు సామేలు అన్నారు.శనివారం ఆయన ధర్మారం గ్రామంలోని తన నివాసంలో రైతులతో కలసి విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్( CK KCR ) కల్తీవిత్తనాలు అమ్మెవారిపై కటిన చర్యలకు ఆదేశించారని,రైతులు నమ్మకమైన దుకాణంలో బిల్లు తీసుకుని విత్తనాలు కొనుగోలు చేయాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.

 Farmers Should Be Alert About Fake Seeds-TeluguStop.com

నకిలీ విత్తనాలు( Fake seeds ) విక్రయిస్తున్న వారిని గుర్తించి అగ్రికల్చర్ అధికారులకు ఫిర్యాదు చేయాలని,విత్తనంలో మోసపోతే ఆరుగాలం చేసే శ్రమ,పెట్టుబడి వృథా కావడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి రాకుండా జాగ్రత వహించాలన్నారు.రైతులు నకిలీ విత్తనాలపై దృష్టి సారించి,బిల్లులు లేకుండా ఆంధ్ర,రాయలసీమ నుండి వచ్చి ఇక్కడ ఏజంట్ల ద్వారా విక్రయించే విత్తనాలు కొనవద్దని చూచించారు.

రోహిణీ కార్తె జొరబడ్డదని,ప్రతిపంటకు అనువైనదని పేర్కొన్నారు.అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం రాశులు ఇంకా యాబై శాతం పైగా ఉన్నాయని, లారీల కొరతతో గొనుగోలు జాప్యం జరుగుతోందన్నారు.

రోజూ పనిలేక బీహార్ హమాలీలు వెల్లిపోయారని,రైతులు తడిసిన ధాన్యం ఆరబెట్టి తూర్పారబట్టాక మిల్లర్లు కొర్రీలు పెడుతూ తరుగు తీస్తున్నారని అన్నారు.లారీల వారు అదనంగా వసూళ్లు చేస్తున్న సమస్యను డిఎం గోపి దృష్టికి తీసుకెళ్లాననిచెప్పారు.

అలాగే మండల పరిధిలో చౌల్లరామారం గ్రామంలో 15 వేల మెట్రీక్ టన్నుల గోదాం సుమారు 20 కోట్లతో ప్రారంభించి, వినియోగంలోకి తేలేదని, మంత్రి గంగుల కమలాకర్( Gangula Kamalakar ) దృష్టికి తీసుకెల్తానన్నారు.రైతు సమస్యలు తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకోసం అనేక నిర్ణయాలు తీసుకోవడంజరిగిందన్నారు.

వాటిని అమలుపరుచడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోన్న వారిపై రైతులు ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు.కాలం నెత్తిమీదకు వచ్చిందని,రైతులకు నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube