ఐదు పదుల వయసులో హరికృష్ణ ని హీరోగా చేసిన వ్యక్తి ఎవరో తెలుసా?

నందమూరి హరికృష్ణ… సీనియర్ ఎన్టీఆర్ తనయుడిగా హరికృష్ణ తలుచుకుంటే స్టార్ హీరో అయ్యేవాడు.తండ్రి అంశతో జన్మించిన హరికృష్ణ సినిమాల్లోకి రావాలనుకుంటే అది అసలు విషయమే కాదు.

 How Hari Krishna Entered In Industry In His 50s Details, Nandamuri Hari Krishna,-TeluguStop.com

కానీ ఎందుకో సినిమాలకు హరికృష్ణ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు బాలనటుడుగా కొన్ని సినిమాల్లో అలరించిన ఆ తర్వాత తండ్రి వెంట రాజకీయాల్లో అడుగుపెట్టిన ఆ పదవులు ఆశించకుండా పార్టీ కోసం తన తండ్రి కోసం పని చేశారు తండ్రి మరణించిన తర్వాతే రవాణా శాఖ మంత్రిగా హిందూపురం ఎమ్మెల్యేగా తన బాధ్యతలు కొన్నాళ్లపాటు చేపట్టాడు.అయితే ఐదుపదుల వయసులో తిరుగులేని స్టార్ డం సంపాదించుకున్నాడు హరికృష్ణ.

తన తండ్రి నటించిన తాతమ్మ కల, రామ్ రహీమ్, దాన వీర శూర కర్ణ, వంటి సినిమాల్లో బాలనటుడిగా కనిపించిన హరికృష్ణ ఆ తర్వాత మరికొన్ని సినిమాల్లోనూ చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించారు.

అయితే పెద్దయ్యాక మాత్రం హీరో అవ్వాలని భావించలేదు.

ఓ వైపు తన తమ్ముడు బాలకృష్ణ సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని హీరో గా ఉన్నప్పటికీ తను మాత్రం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండి ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేశాడు.మరి మళ్లీ 50 ఏళ్ల వయసులో హీరో కావాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది అంతు చిక్కని ప్రశ్న.

దాదాపుగా 20 ఏళ్ల విరామం తర్వాత తాలీవుడ్ మన్మధుడు నాగార్జున, హరికృష్ణ కాంబినేషన్లో సీతారామరాజు సినిమా వచ్చి అది సూపర్ డూపర్ హిట్ అయింది.ఈ చిత్రానికి వైవిఎస్ చౌదరి దర్శకత్వం వహించగా హరికృష్ణ ని మళ్లీ సినిమాల్లోకి తీసుకొచ్చిన ఘనత మాత్రం ఆయనకే దక్కింది.

Telugu Balakrishna, Yvs Chaudhary, Hari Krishna, Harikrishna, Lahiri Lahiri, Nan

ఆ తర్వాత శ్రీరాములయ్య సినిమాలో మోహన్ బాబు కోసం కామ్రేడ్ సత్యం అనే ఒక గెస్ట్ పాత్రలో నటించి మళ్లీ ఒక హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు హరి కృష్ణ.ఇక అదే క్రమంలో వైవియస్ దర్శకత్వంలో మరోసారి లాహిరి లాహిరి లాహిరిలో నటించగా ఇది కూడా ఘన విజయాన్ని అందుకుంది.ఈ చిత్రానికి ఆయనకు ఉత్తమ నటుడిగా నంది అవార్డు సైతం దక్కింది.

Telugu Balakrishna, Yvs Chaudhary, Hari Krishna, Harikrishna, Lahiri Lahiri, Nan

ఇక మరో మారు వీరిద్దరి కాంబినేషన్లో సీతయ్య సినిమా రాగా, అతనికి తిరుగులేని హీరోగా స్టార్ డం ఇచ్చింది ఈ చిత్రం.ఇలా ఇంత లేటు వయసులో హీరోగా ఎంట్రీ ఇచ్చి హరికృష్ణ సక్సెస్ అవ్వడం అంటే అది తన బ్లడ్ లో ఉన్న నటన అంటారు ఆయన.ఆ తర్వాత స్వామి, టైగర్ హరిశ్చంద్రప్రసాద్ వంటి సినిమాల్లో నటించగా చివరగా కృష్ణతో శ్రావణమాసం అనే సినిమాలో నటించారు.ఆ తర్వాత ఆయన ఒక రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube