రామస్వామి గుట్ట వద్ద ఇళ్లు త్వరగతిన పూర్తి చేయాలి:వి.పి.గౌతమ్

సూర్యాపేట జిల్లా:ఆదర్శ కాలనీలోని ఇళ్ల నిర్మాణాలను త్వరగతిన పూర్తి చేసి లబ్దిదారులకు అందించాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ డైరెక్టర్ వి.పి.

గౌతమ్ అన్నారు.శుక్రవారం సూర్యాపేట జిల్లా(Suryapet) హుజుర్ నగర్(Huzur Nagar) మున్సిపల్ పరిధిలోని రామస్వామి గుట్ట వద్ద నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణాలను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్(Tejas Nandalal) తో కలిసి పరిశీలించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కూలీలను పెంచి నిర్దేచించిన సమయానికి నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలన్నారు.రోడ్లు,త్రాగునీరు,డ్రైనేజీ,వాటర్ సంపులు,సెప్టిక్ ట్యాంక్లు, విద్యుత్ సరఫరా,బస్తీ దావఖానా,ప్రైమరీ స్కూల్ లాంటి మౌళిక సదుపాయాలు త్వరగా ఏర్పాటు చేయాలన్నారు.

ప్రతివారం సమీక్ష ఏర్పాటు చేస్తామని వారం వారం పనులు పూర్తి అవ్వటంలో పురోగతి ఉండాలని, కలెక్టర్,హౌజింగ్ ఎస్ఈ ప్రతి శుక్రవారం ఈ ఇండ్ల నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహిస్తారని తెలిపారు.ఇండ్లు పూర్తి అయ్యేవరకు హౌజింగ్ కార్యాలయాన్ని ఇక్కడే ఏర్పాటు చేసుకోవాలని ఏమైనా సిబ్బంది అవసరం ఉంటే తెలియజేయాలన్నారు.2160 ఇండ్ల నిర్మాణానికి 74.8 కోట్లు కేటాయించటం జరిగిందని,ఇప్పటి వరకు రూ.10 కోట్లు విడుదలయ్యాయని,మిగిలినవి దశల వారీగా పనులు పూర్తి అవ్వగానే నిధులను వెంటనే మంజూరు చేయటం జరుగుతుందని,నవంబర్ (November)లోపు ఇండ్ల నిర్మాణం నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని, అధికారులు,కాంట్రాక్టర్లు నిబద్దతతో పనిచేయాలని తెలిపారు.జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 135 బ్లాక్ లలో 2160 ఇండ్ల నిర్మాణాలను మొదలు పెట్టడం జరిగిందని,ఇప్పటి వరకు 560 పూర్తిచేయటం జరిగిందని,మిగిలినవి వివిధ దశలలో అసంపూర్తిగా ఉన్నాయని, వాటిని త్వరగా పూర్తి చేయాలని హౌజింగ్, ఎలక్ట్రీసిటి,మున్సిపల్,ఆర్ డబ్ల్యూఎస్ అధికారులు సమన్వయం చేసుకుంటూ సిసిరోడ్ల మధ్యలో కరెంట్ స్తంభాలు లేకుండా స్టంభాలను మార్చాలని సూచించారు.

Advertisement

ఈ సమావేశంలో హౌజింగ్ ఎస్ఈ వెంకటదాస్ రెడ్డి, ఆర్డీఓ శ్రీనివాస్,మున్సిపల్ చైర్మన్ అర్చన,వైస్ చైర్మన్ సంపత్ రెడ్డి,హౌజింగ్ డిఈ విజయ్ సింగ్,మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, కాంట్రాక్టర్ విజయ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

బురదదారే వారికి దిక్కు..బీసీ బాలుర వసతి గృహం విద్యార్థుల దుస్థితి
Advertisement

Latest Suryapet News