పదవి విరమణ పొందుతున్న హోం గార్డ్ లక్ష్మి కు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖలో హోంగార్డ్ గా గత 28 సంవత్సరాలుగా విధులు నిర్వహించి పదవి విరమణ పొందుతున్న గోశిక లక్ష్మీ ను బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పూలమాల వేసి శాలువలతో ఘనంగా సన్మానించారు.

పోలీస్ ఉద్యోగ నిర్వహణలో అంకిత భావంతో పనిచేసి అందరి మన్ననలను పొందినారు అని శుభాకాంక్షలు తెలియజేస్తు వెల్ఫ్ ఫెర్ ఫండ్ నుండి ఆర్థిక సహయంగా 10,000-/రూపాయలు అందచేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్‌ విభాగంలో సుధీర్ఘకాంగా విధులు నిర్వహించి పదవీవిరమణ చేసిన సేవను మరువమని, పదవీవిరమణ చేసిన మీరు కుటుంబంలో ఎలాంటి సమస్య వచ్చిన తనను సంప్రదించ వచ్చని పోలీసు రిటైర్ మెంట్ కేవలం తన వృత్తికే, కాని తన వ్యక్తిత్వానికి కాదు అని కొనియాడారు.

Home Guard Lakshmi, Who Is Retiring, Was Bid Adieu At The District Police Office

ఈ కార్యక్రమంలో ఆర్.ఐ రమేష్, హెడ్ కానిస్టేబుల్ రవీందర్ పాల్గొన్నారు.

ఒక్క స్పూన్ టీ పోడితో జుట్టును చేసుకోండి డబుల్..!
Advertisement

Latest Rajanna Sircilla News