భారతీయ విద్యార్ధుల మరణాలు.. అమెరికా ప్రభుత్వానికి ఎన్ఆర్ఐ సంఘం కీలక సూచనలు

గడిచిన కొద్దినెలలుగా అమెరికాలో భారతీయ విద్యార్ధుల( Indian-origin students ) హత్యలు, ఆకస్మిక మరణాలు, భౌతికదాడుల నేపథ్యంలో పిల్లలు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే అగ్రరాజ్యానికి వెళ్లినవారితో పాటు అమెరికా వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న వారిని కూడా ఈ పరిణామాలు ఉలిక్కిపడేలా చేస్తున్నాయి.

 Diaspora Body Urges Us Govt To Work Towards Addressing The Spike In Deaths Of In-TeluguStop.com

ఈ క్రమంలో విద్యార్ధుల మరణాలను అడ్డుకునేందుకు కృషి చేయాలని అమెరికా ప్రభుత్వం, విశ్వవిద్యాలయాలు, విద్యార్ధి సంఘాలకు చెందిన ప్రముఖ ఏజెన్సీలను అమెరికాకు చెందిన ప్రవాస భారతీయ సంఘం కోరింది.‘‘ ఫాండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పోరా స్టడీస్ (ఎఫ్ఐడీఎస్) ’’ అమెరికాలో భారతీయ విద్యార్ధుల మరణాల పట్ల విచారం వ్యక్తం చేస్తోంది.

Telugu Fids, Indian Origin, Neel Acharya, Ohio, Umasatya-Telugu NRI

అనుమానాస్పద కాల్పులు, కిడ్నాప్, భద్రతా పరిజ్ఞానం లేకపోవడం వల్ల ప్రకృతి పరమైన మరణాలు, ఆత్మహత్యలను ప్రేరేపించే మానసిక సమస్యలు, అనుమానాస్పద ప్రమాదాలు, హింసాత్మక నేరాలను కారణాలుగా ఈ సంస్థ పేర్కొంది.అధికారులు భద్రతపై అవగాహనను పెంచాలని, శోధన, రెస్క్యూ విధానాలను మెరుగుపరచాలని, ర్యాగింగ్‌( Ragging )కు వ్యతిరేకంగా కఠినమైన నిబంధనలను అమలు చేయాలని ఎఫ్ఐడీఎస్ పేర్కొంది.ప్రమాదాలు, భద్రతపై అవగాహన పెంచడంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే చర్యలు చేపట్టాలని సంస్థ సూచించింది.

Telugu Fids, Indian Origin, Neel Acharya, Ohio, Umasatya-Telugu NRI

2024 ప్రారంభం నుంచి నేటి వరకు అమెరికాలో 8 వరకు భారత సంతతి, భారతీయ విద్యార్ధులు, వ్యక్తులు పలు కారణాలతో మరణించారు.గత నెలలో తప్పిపోయిన 25 ఏళ్ల భారతీయ విద్యార్ధి ఈ వారం క్లీవ్‌లాండ్ నగరంలో శవమై కనిపించాడు.గత వారం ఒహియోలో ఉమా సత్య సాయి గద్దె( Uma Satya Sai Gadde ) అనే భారతీయ విద్యార్ధి మరణించాడు.

ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.జనవరిలో 19 ఏళ్ల నీల్ ఆచా( Neel Acharya )ర్య పర్డ్యూ యూనివర్సిటీ క్యాంపస్‌లో శవమై కనిపించాడు.ఊపిరాడకపోవడం వల్లే ఆచార్య మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు.శీతల ఉష్ణోగ్రతలు, ఆల్కహాల్ మత్తు కూడా అతని మరణంతో ముడిపడి వున్నాయని కరోనర్ కార్యాలయం తెలిపింది.

కానీ తర్వాత కొన్ని రోజులకే నీల్ ఆచార్య ఆత్మహత్య చేసుకున్నట్లు కరోనర్ కార్యాలయం వెల్లడించింది.మరో ఘటనలో కనెక్టికట్‌లో ఇద్దరు భారత సంతతికి చెందిన విద్యార్ధులు 22 ఏళ్ల దినేష్ గట్టు .21 ఏళ్ల సాయి రకోటి మృతదేహాలు జనవరి 15న వారి అపార్ట్‌మెంట్‌లో కనిపించాయని పోలీసులు వెల్లడించారు.మెడికల్ ఎగ్జామినర్ కార్యాలయం ప్రకారం .సేక్రేడ్ హార్ట్ యూనివర్సిటీ విద్యార్ధులు ప్రమాదవశాత్తూ ఫెంటానిల్ అధిక మోతుదుతో తీసుకోవడంతో ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు.జార్జియా గ్యాస్ స్టేషన్‌లో వివేక్ సైనీ అనే 25 ఏళ్ల భారతీయ గ్రాడ్యుయేట్ విద్యార్ధినిని కొట్టి చంపబడ్డాడు.

నిందితుడు జూలియన్ ఫాల్క్‌నర్ (53)ని అదుపులోకి తీసుకున్నారు .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube