కత్రినా రహస్యంగా పెళ్లి చేసుకోవడానికి ఇదే కారణమా.. అసలు విషయం బయటపెట్టిన నటి!

బాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమ పక్షులుగా విహరిస్తూ గత ఏడాది డిసెంబర్ నెలలో రాజస్తాన్‌లోని సవాయ్ మాధోపూర్ సిక్స్ సెన్సెస్ కోటలో మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు నటి కత్రినా కైఫ్ విక్కీకౌశల్.అయితే వీరి పెళ్లి గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వచ్చినప్పటికీ ఈ జంట మాత్రం తమ పెళ్లి గురించి అధికారకంగా ఎక్కడ ప్రస్తావించలేదు.

 Heroine Katrina Kaif About Marriage With Vicky Kaushal Details, Katrina, Secret-TeluguStop.com

వీరి పెళ్లి విషయాన్ని ఎంతో రహస్యంగా ఉంచడమే కాకుండా పెళ్లి తంతు పూర్తి అయ్యేవరకు వీరి పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలను కూడా ఎక్కడ బయట పెట్టలేదు.

ఇదిలా ఉండగా ఈ జంట ఇలా రహస్యంగా పెళ్లి చేసుకోవడానికి గల కారణం ఏంటి అసలు పెళ్లి విషయంపై స్పందించకపోవడానికి గల కారణం ఏంటి అనే విషయాన్ని తాజాగా ఈ జంట బయట పెట్టారు.

తాజాగా జరిగిన ఫిలింఫేర్ అవార్డు వేడుకలలో భాగంగా నటుడు విక్కీ కౌశల్ నటించిన సర్ధార్ ఉదమ్ సింగ్ చిత్రంలో నటనకుగాను ఉత్తమ నటుడు (క్రిటిక్స్) విభాగంలో అవార్డు అందుకున్నాడు.ఈఅవార్డు వేడుకలో భాగంగా కత్రినా కైఫ్ తమ పెళ్లి రహస్యంగా చేసుకోవడానికి గల కారణం ఏంటో తెలియజేశారు.

Telugu Katrina Kaif, Katrina, Vicky Kaushal, Rajasthan, Sardharudham, Sawaimadho

ఈ సందర్భంగా కత్రినా కైఫ్ మాట్లాడుతూ మా పెళ్లి రహస్యంగా చేసుకోవడానికి గల కారణం కేవలం కరోనా అని సమాధానం చెప్పారు.మా పెళ్లి సమయంలో కరోనా విపరీతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మా పెళ్లి విషయాన్ని గోప్యంగా ఉంచామని అప్పటికే మా కుటుంబంలో ఎంతో మంది కుటుంబ సభ్యులు కరోనా బారిన పడ్డారు.మా వల్ల ఇతరులు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతోనే మా వివాహాన్ని రహస్యంగా చేసుకున్నామని అయితే మా పెళ్లి మాత్రం ఎంతో ఘనంగా, ఎంతో సంతోషంగా జరిగిపోయిందని ఈ సందర్భంగా కత్రినా కైఫ్ వీరి పెళ్లి గురించి కామెంట్స్ చేశారు.ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube